పుట:RangastalaSastramu.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లోకము చదివి పాత్ర చూచనచేసి నిష్క్రమిస్తాడు. 'స్థాపన ' పేరుతో గల ఈ ప్రస్తావన భాసుని రూపకాలలోని విశిష్టతలలో ఒకటి.

అతరవాత కొట్టవచ్చినట్టు కనిపించేది భరతముని లక్షణాలకు విరుద్ధంగా రంగస్థలంమీద మృతిని చూపించడం. ప్రతిమా నాటకంలోదశరధుని మృతి. ఊరుభంగంలో దుర్యోధనిను మృతి, బాలచరితలో కంసుని మృతి దృశ్యమానము చేయడం ఇందుకు ఉదాహరణ. అట్లాగే లక్షణవిరుద్ధంగా ఊరుభంగాన్ని విషాదాంతంగా భాసుడు రచించినాదు. (దుర్యోధనుడు నాయకుడైనప్పుడిది విషాదాంతమవుతుంది; కాని భారతీయదృష్టితో చూసినప్పుడిందుకు భీముడు నాయకుడవుతాడు; అప్పుడది విషాదాంతము కాదు.) భరతముని రంగస్థలంమీద యుద్ధాలు చూపకూడదని నిషేధించినా, భాసుడు బాలచరిత మొదలైన రూపకాలలో యుద్ధాలను చిత్రించినాడు.

వీర కరుణరసాలు భాసునికి అభిమానరసాలు. వీరరసము భాస నాటకాలన్నింటిలో గుభాళిస్తూనే ఉంటుంది. ఇంక కరుణరసము ఊరుబంగంలోను (దుర్యోధనుని మృతి). ప్రతిమా నాటకంలోను (దశరధుని మృతి) ప్రబలంగా కన్పిస్తుంది.

మనస్తత్త్వ చిత్రణలో భాసుడు అందెవేసిన చేయి. ఒక్క వాక్యంలో, ఒక్క సంఘటనలో పాత్ర మనస్తత్వాన్ని ప్రేక్షకులకు అవగతంచేయగల దిట్ట భాసుడు. స్వప్న వాసవదత్త, భారతరూపకాలు భాసుని మనస్తత్త్వ చిత్రణ నైపుణ్యాన్ని చాటుతవి.

కల్పనలో భాసుడు సిద్ధహస్తుడు. ప్రతిమా నాటకంలోని ప్రతిమా గృహము, రామ భరతులు సాదృశ్యము; పంచరాత్రంలో దుర్యోధనుడు పాండవులకు అర్ధరాజ్యమిచ్చినట్లు చిత్రణ; ఊరుభంగంలోనూ మధ్యమవ్యాయోగం లోనూ కధలను మలచినతీరు భాసుని కల్పనాశక్తికి చక్కని ఉదాహరణలు.

భాసుని వర్ణనలు, సంభాషణలు, కధా విన్యాసము నాటకీయతతో తొణికిసలాడుతూ ఉంటాయి. సాహిత్యంమీదకంటె నాటకీయత మీద భాసుని దృష్టి ఎక్కువగా లగ్నమై ఉంటుంది.

భాసుని రూపకాలు లలితకళ లన్నింటికి సంగమాలు; వీటిలో సాహిత్యమేగాక నృత్యము (బాలచరితము), సంగీతము, శిల్పము(ప్రతిమ), చిత్రకళ