Jump to content

పుట:RangastalaSastramu.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోలుబొమ్మలాట

తెలుగు జాతీయత ఉట్టిపడు;తూ ఉంటుంది. మానవ మనస్తత్వాన్ని ఈ వేషాలు ద్యోతకము చేస్తాయి.

వాచికము వచనంలోనె కాకుండా ప్రధ్యాలతో, కీర్తనలతో అలరారుతూ ఉంటుంది. వీరు ప్రదర్శించే అర్థనారీశ్వరవేషము ఒక చక్కని సంగీత నృత్యనాటిక. వీరు సంగీతభాగాలను పఠించేటప్పుడు హార్మనీ, మద్దెల, ఫిDEలు ఉపయోగిస్తారు.

పగటివేష ప్రదర్శనలు బుడబుక్కలవేషంతో ప్రారంభమై, శారద వేషంతో అంతమవుతాయి. వీటిలో ఏకపాత్ర, ద్విపాత్ర, బహుపాత్ర వేషాలున్నవి. తెలుగు వేషాలే గాక కన్నడ, లింగబలిజ, పఠానీ, సిద్ధి, దొరవంటి ఆంధ్రేతర వేషాలుకూడా ఉన్నాయి, పఠానీ, పంతులు, రెడ్డి వంటి వేషాలు ప్రహసనదృశ్యాలు. వీటిలోను ప్రారంభము, పరాకాష్ఠ, ముగింపు, పాత్రల ప్రవేశిక నిష్క్రమణలు, పాత్రోచితమైన ఆహార్యము గోచరిస్తాయి. ఈ వేషాలన్నీ హాస్యరసంతొ తొణికిసలాడుతూఉంటాయి. పగటివేషాలు రంగస్థలంకూడ ఆరుబయలు రంగస్థలమే.

తోలుబొమ్మలాట

మానవుని రూపకల్పనాతృష్ణలోనుంచి జనించినదే తోలుబొమ్మలాట. సజీవవ్యక్తులకు బదులు నిర్జీవప్రతిమలను చలింపజేయడం ద్వారా కధకు రూపకత్వము కల్పించడమే తొలుబొమ్మలాటలోని విశేషము. క్రీస్తుకుపూర్వంనుంచే ఈ తోలుబొమ్మలాటలు తెలుగుదేశంలో వర్ధిల్లుతున్నాయని చరిత్రకారులు తెల్పుతున్నారు. "భారతాది కధలు చీరమరగుల నారంగ బొమ్మలనాడించువారు" అని పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాధుడు పేర్కొనడంవల్ల కనీసము పన్నెండవ శతాబ్ధంనాటినుంచి అయినా తోలుబొమ్మలాటలు తెలుగుదేశంలో ప్రచారంలో ఉన్నట్లు స్పస్టమవుతోంది.

తోలుతో చేసిన బొమ్మలను ఆడిస్తారు కాబట్టి ఈ కళారూపానికి తోలుబొమ్మలాట అని పేరువచ్చింది. ఈ మొమ్మలను జింక, మేక, గొర్రె, గాడిద తోళ్ళతో చేస్తారు. ఉత్తమపాత్రలకు జింకతోళ్ళు, తదితర పాత్రలకు తక్కిన తోళ్లు ఉపయోగిస్తారు. ఈ బొమ్మల ప్రమాణము పూర్వము ఒకాడుగునుంచి ఏడూడుగుల వరకు ఉండేది. హనుమంతుని బొమ్మలను నేటికీ వివిధ పరిమాణాలలో తయారు చేస్తారు.