పుట:RangastalaSastramu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోళ్ళను నునుపుగా ఉండేటట్టు శుభ్రపరచి వాటిపై బొగ్గుతో బొమ్మగీసి కత్తిరిస్తారు. ఆభరణాలు ద్యోరకము చేయడానికి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. వాటిమీద పాత్రకు అనుగుణమైన రంగువేస్తారు. అవయవాల కదలికలు చూపడానికి బుజాలదగ్గర, మోచేతిదగ్గర, మోకాళ్ళదగ్గర అతుకుపెట్టి తాళ్ళతో కడతారు. బొమ్మ మొత్తానికి ప్రధాన సూత్రమొకటి ఉంటుంది. బొమ్మ మధ్య నిలువునా వెదురుబద్ధ కడతారు. ఎదమ చేతితో ఈ బద్ధను, కుడిచేతితో సూత్రాన్నిధరించి ఆడిస్తారు. ఈ ప్రక్రియనుబట్టే 'సూత్రధార ' శబ్ధము పుట్టిందని విమర్శకుల అభిప్రాయము.

ఈ బొమ్మలాటవారు ఎక్కువగా ప్రదర్శించేది లంకాదహనము, మైరావణ, విరాటపర్వము, పద్మవ్యూహము. వాచికానికి రంగనాధరామాయణము, ద్విపద భారతము ఎక్కువగా ఉపయోగిస్తారు. తోలుబొమ్మలాటలో ఉపయోగించడానికి ప్రత్యేకరచనలు కూడా కొందరు చేసినారు. బొమ్మలాట సాంబయ్య రచించిన కిరాతార్జునీయము, మరిగంటి భట్టరు రామానుజాచార్యులు రచించిన శ్రీరామ నాటకము తోలు బొమ్మలాట రచనలే.

తోలుబొమ్మలాట కూడా ఆరుబయట ప్రదర్శించే కళారూపమే. దీని రంగస్థలము నాలుగువిఅపులా మూసిన పెట్టెవంటిది. మూడువైపుల తడికల తోనో తాటాకు దడితోనో మూసివేస్తారు. నాలుగోవైపు తెల్లటి తెర గట్టిగా బిగిస్తారు. ఈ తెర భూమిమి రెండుమూడు అడుగుల ఎత్తున ఏటవాలుగా ఉంటుంది. తెరవెనక ఆముదం దీపాలు ఉంటాయి. తెరకు అంటిపెట్తుకొని దొమ్మ లుంటాయి. తెరమీద బొమ్మలను ఈతముళ్ళాతోగుచ్చి నిలబెట్టుతారు. తోలుబొమ్మలు పారదర్శికాలు కాబట్టి వెనకదీపాల మూలంగా ఇవి ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తాయి.

వీరి సంగీతబాణి ప్రత్యేకంగా 'తోలుబొమ్మలకత్తు ' అని పేరు గాంచినది. స్రీ పాత్రలకు స్త్రీలు, పురుషపాత్రలకు పురుషులు వాచికము పఠిస్తారు. తోలుబొమ్మలాట దైవప్రార్ధనతో ప్రారంభమవుతుంది. తరవాత వినాయకుడు, సరస్వతీదేవి తెరమీదకు వచ్చి ఆశీర్వదిస్తారు. ఆతరవాత కధ వినాయకుడు, సరస్వతీదేవి తెరమీదకు వచ్చి ఆశీర్వదిస్తారు. ఆ రతవాత కధ ప్రారంభమవుతుంది. వాచికము వచనంలోను ద్విపదలోను మాత్రమేగాక, దరువుల రూపంలోకూడ ఉంటుంది. పాత్రప్రవేశము సూచిస్తూ ప్రతి పాత్రకు