దేశి రూపకాలు
ప్ర్రారంభమైతే శాంతి భద్రతలు నశిస్తాయి; సంఘము వృద్ధిలోకిరాదు. అందుచేత అట్లాంటి అన్యాయాలను ఎప్పటికప్పుడువేలెత్తిచూపే దిక్సూచికగా 'హితోపదేశ జనకం 'గా ఉపయుక్తమయ్యే కళారూపము సంఘానికి ఎంతైనా అవసరము. అట్లాంటి కళారూపమే 'పగటివేషాలు ' ఎక్కువగా పగలే ప్రదర్శిస్తూఉంటారు కాబట్టి వీటికీ పేరువచ్చింది. కాని పఠానీవేషము, రెడ్దివేషము, ల్పంతులువేషము, రాత్రులుకూడా ప్రదర్శిస్తారు. అయినా వీటిని పగటివేషాలుగానే పరిగణిస్తారు. ఈ పగటి వేషాలే ప్రచ్చన్నవేషాలనీ (Fancy dresses) కూడ అంటారు.
పగటి వేషాలు 64 విధాలు, వీటిని జాతీయాలంటారు, జీతీయాలనడం లోనే జాతిని ప్రతిబింబింపజేసి, దాని క్షేమాని పాటుపదే కళారూపమని ద్వని, రంగస్థలం మీద ఈ పగటి వేషధారణ వర్తనను కలాపమంటారు.
ఈ వేషాలను మూడు తరగతులుగా విభజించుకోవచ్చు-- 1.వినోద వేషాలు, 2.అభ్యుదయవేషాలు, 3.తామనవేషాలు. వినోదము కలిగించడం ప్రధానాశయంగా గలవి వినోదవేషాలు. ఉదా|| మందులవేషము, బుడబుక్కలవేషము, గారడివేషము. వీటి ప్రధానాశయము వినోదమైనా సాంఘిక దురాచరాలను మధ్య మధ్య హాస్య ధోరణిలొ వెక్కిరించడం కద్దు.
జాతి అభ్యుగయము ప్రధానాశయంగా గలవేషాలు అభ్య్యుదయవేషాలు, జాని అభ్యుదయానికి అవరోధాలైన మతసాంఘిక దురన్యాయూఅలను ఈ వేషాల సహాయంతో దుయ్యపడతారు. ఉదా|| కోమటివేషం. ఈవేషంవేసి కోమట్లు అంటే వ్యాపారస్తులు తోటివ్యాపారస్తులను, ప్రజలను ఎట్లామోసగించేది బట్టబయలు చేస్తారు. రెడ్డి, పంతులు వేషాలువేసి వారు రైతులను ఎట్లా మోసగించేది వెల్లడిస్తారు.
తామసప్రవృత్తిని ప్రదర్శించే వేషాలు తామసవేషాలు. ఉదా|| శక్తి భేతాళ, శూర్పణఖవేషాలు, ఆహార్యంలో, వాచికంలో పగటివేషధారులు ఉద్ధండులు, తెలుగుదేశంలో ఎన్నికులాలు, మతాలు ఉన్నాయో వారందరి ఆహార్యవాచికాలను అనుకరించి, పగటివేషధారులు ప్రజలకు దిగ్బ్రమ కలిగించిన ఘట్టాలు అనేకము.
పగటి వేషాలలో చాలా వేషాలు 'లోకవృత్తనుకరణాలు ', 'హితోపదేశజనకాలు ' వాచికము ఎవరు రిచించినదో తెలియదు. వీటిలో