పుట:RangastalaSastramu.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పగటివేషాలు

ఇంతకీ యక్షగానంలోని కొరవంజి పాత్ర సామాన్యంగా మామూలు మానవ-ఎరుకతకాదు. భారతీదేవి లేదా పార్వతీదెవి లేదా గంగమ్మ లేదా శివుడు కొరవంజి వేషంలో వెళ్ళి, నాయికకు ఎరుకజెప్పి రంజింపజేస్తాడు.

కొరవంజులకు కొరవంజులనే పేరు లేకపోయినా కొరవంజి పాత్ర గల యక్షgaaన నాటకాలను రెందు రకాలుగా విబజించవచ్చు. 1.శృంగార కొరవంజులు, 2.వేదాంత కొరవంజులు.

1.శృంగార కొరవంజులు: నాయికానాయకుల ప్రేమకు సంబందించినవి. ఇవి మూడు రకాలు--కొరవంజి కొరవ నాయకుల ప్రణయాన్ని చిత్రించేది మొదటి రకము. ఉదా|| గరుడాచలము, కిరాత విలాసము, వీటిలో కొరవంజి సోది చెప్పటం ఉండదు.

రెండవ రకం శృంగార కొరవంజులలో భారతీదేవి లేదా పార్వతీదేవి లేదా కధానాయకుడు కొరవంజి వేషము వెసుకొనివెళ్లి నాయికకు సోదిచెప్పడం ఉంటుంది. ఉదా|| తులాభరము, మన్నారు దాస విలాసము. మూడవరకము శృంగార కొరవంజులలో ఎరుకత మానవ స్త్రీ. దేవగణానికి చెందినదికాదు.

2.వేదాంత కురవంజి: దీని ప్రధానోద్దేశము వేదాంత బోధ. దీనిలో ఎరుకత వేదాంతము బోధిస్తుంది. సజ్ఞాన ఎరుకత-

మరపులేనట్టి సన్మార్గులకెల్ల
నెరుక ఇట్టిదటంచు నెరుక పడంగ
నెరుక జెప్పుట కొరకెరుకత వచ్చె

అంటుంది.

ఇందులో "ఎరుక ఇట్టిదతంచు" అనే చోట ప్రయోగించిన ఎరుక శబ్ధానికి అర్ధము జ్ఞానము. ఉదా|| సుజ్ఞాన కవిత, జీవ ఎరుకల కురవంజి, ముక్తికాంతా విలాసము. కొరవంజి ప్రయోగ విచానము వీధినాటక ప్రయోగ విధానమే!

పగడిచేషాలు

సంఘంలో నీతి నియమాలు నశించి, ఓకవర్గము ఇంకొకవర్గాన్ని, ఒకవ్య్హక్తి ఇంకొక వ్యక్తిని మతం పేరుతో, ఆచారంపేరుతో, లోకవ్యవహారం పేరుతో, వ్యాపారంపేరుతో మోసగించడం, దోచుకోవడం, బాధించడం