యక్షగానము
రచనాక్రమము
దైవప్రార్ధనతో గ్రంధము ప్రారంభించడం భారతీయ స్సంప్రదాయము. ఈ సంప్రదాయానుసారంగానే యక్షగానాలు కూడా దైవప్రార్ధనతో ప్రారంభమవుతాయి. ఆ తరవాత వినాయక స్తవము, పూర్వకవిస్తుతి, కుకవినింద, కృతి భర్త వర్ణన, షష్ట్యజ్ంతాలు; పిమ్మట యక్షగానంపేరు, కర్తపేరు; ఆటుపిమ్మట కధాప్రారంభము. ఈ పూర్వరంగమంతా శ్రవ్యప్రబంధాల పూర్వకంగాలనుపోలిఉంటుంది. ప్రదర్శన సమయంలో ల్నటి ఆడుతూ పాడుతూ ఈ పూర్వ రంగాన్ని ప్రయోగిస్తుంది. ఆ తరవాత, కధను ఆడుతూ పాడుతూ వినిపిస్తుంది. కధాకధనం మధ్యమధ్య"అని పలికి యచ్చట నిలువజాలక భయపడుచున్న సుగ్రీవునితో హనుమంతు డేమనుచున్నాడు" అని కధాసంధి ఉంటుంది. కధదేశి చందస్సులో సూటిగా నడుస్తుంది. తరవాత ఏలలు, ధవశలు, హారతులు, ప్రసక్తాలయి. చివరకు గద్యంలో తిరిగి కృతిభర్త, కృతికర్త పేర్లు వినిపిస్తాయి.
కవిత్వము చిన్నచిన్న మాటలతొ జాతీయత ఉట్టిపడుతూ సుబోధకమైన శైలిలో ఉంటుంది. శృంగార, వీర, కరుణరసాలు ఈ యక్షగానంలో ప్రాధాన్యము వహిస్తూఉంటాయి. కధనశిల్పము పరవళ్లు తొక్కుతుంది. వీటిలో ఒక్కొక్కపాత్రను ఒక్కొక్కవ్యక్తి ధరించే ఆధారంలేదు, నర్తకి ఒక్కతే నృత్యాని అనువైన దుస్తులు ధరించి ఆడుతూ పాడుతూ కధ వినిపిస్తుంది.
ప్రయోగవిధానము
ప్రయోగానికి రంగస్థలము ఉండవలెగదా. రాజాప్రాసాదాలలో చక్కగా నిర్మించిన నాటకశాలలుండేవి. ఇక ప్రజాబాహుళ్యానికిగాను, రాజాప్రాసాదాలళో చక్కగా న్మిర్మించిన నాటకశాలలుండేవి. ఇక ప్రజాబాహుళ్యానికిగాను, నాటక ప్రదర్శన ప్రారంభంకావటానికి ముందు ఏ దిబ్బమీదనో, నదివీధిలోనో పందిరివేసి, అందులో వేదిక అమర్చేవారు. ఆవేదికే ఆనాటి రంగస్థలము. 'ఒయ్య జవని కలగల్పంబు వెడలి ' అని పండితారాధ్య చరిత్రలో చెప్పడంవల్ల పూర్వంకూ'డా తెరలుపయోగించేవారని తెలుస్తున్నది. అయితే, ఆ తెరలు కిందికి పైకి వెళ్ళేవి. ప్రక్కలకు లాగేవికావు. బసవపురాణంలో "జవనిక రప్పించి" అని ప్రయోగించడంవల్ల ఆనాటి తెర అప్పటికప్పుడు అడ్దుపెట్టేదని స్పష్టమవుతున్నది. ఆనాటి దీపాలు కాగడా దీపాలే, తెర తొలగించగానే నటిముఖము తళతళ మెరుస్తూ అందరికీ స్పష్టంగా కనిపించడానికి కాగడా మంటలమీద కొద్దిగా గుగ్గిలం చల్లి భగ్గుమనిపించేవారు. ప్రేక్షకులు రంగస్థలం నలువైపులా కూర్చుం