పుట:RangastalaSastramu.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



యక్షగానము

అనాదిగా ఆంధ్రదేశంలో జక్కులవరు ఆడుతూ, పాడుతూ కధ వినిపిస్తూ, నాటకాలాడుతూ ప్రజలను రంజింప జేస్తున్నారు. ఈ జక్కుల పాటనే సంస్కృతంలో యక్షగానమన్నారు.

ఈ యక్షగానము మూడు దశలలొ మూడు రూపాలలో పరిణతి చెందింది. మొదటి రూపకము సంగీత సంకీర్తనరూపము. ఆదిలో యక్షగానము ఒకవిధమైన గాన నరణి-

"కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" అన్న శ్రీనాధుని పద్యంవల్ల ఈ విషయము రూఢి అవుతోంది. బహుశా ఈ గానసరణి దేశసరని కావచ్చు. ఈ గానసరణిలో కీర్తనలు రచించి దైవాన్ని సంకీర్తించేవారు. ఈ దశలొ యక్షగానము సంకీతనరూపంలో విలసిల్లింది.

రెండవ రూపము కధాకధన ప్రబంధరూపము. ఏదైనా ఒక కధను పాడుతూ ఆడుతూ వినిపింఛడం దీని సామాన్యలక్షణము. ఈ యక్షగాన రూపము బహుళవ్యాప్తి చెందడంవల్ల లాక్షణికులు ఈరూపానికి లక్షణము చెప్పవలచివచ్చింది. ఇందులో జానపద చ్చందస్సు ప్రాధాన్యము వహిస్తుంది. పరంబులు, దరువులు, ఏలలు, ఢవళంబులు, మంగళహారతులు, శోభనంబులు ఉయ్యాలలలు, జోలలు.... రగడలు, జంపెలు, ఆటతాళాదులు ఈరూపంలో నిబద్ధంకావలెనని లాక్షణికులు ఆదేశము. అతిప్రాసీనమైన ఓంయమంత్రి గరుడాచల యక్షగానంలో జంపెలు 19, త్రిపుటలు 12, ఆటతాళాలు 11, ఏకతాళాలు 5, ద్విపదలు 5, కందపద్యాలు 3, తేటగీతులు 3, కురుచ జంపెలు 3, వచనాలు 52 ఉన్నాయి. ఇవిగాక ఏలలు, శోభనాలు, ధవళాలు, మంగళహారతులు ఉపయుక్తమైనాయి.