Jump to content

పుట:RangastalaSastramu.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డేవారు. అందుకని నటి ఆడుగూ పాడుతూ నలువైపులా తిరిగి కధ వినిపించేది. గరుడాచలము, నీలాచలము సుగ్రీవవిజయము - ఇవి యక్షగాన ప్రబంధాలను మచ్చుతునకలు.

ఈ యక్షగాన ప్రబంధాలకు రూపాంతరాలే కలాపము, బుర్రకధ, హరికధ.

కలాపము

యక్షకన్యలాగ నృత్యానికనువైన ఆ హార్యంగాక ఏదో ఒక నాయకుని పాత్ర ఆహార్యాన్ని ధరించి నటి ఆడుతూ పాడుతూ తన కధను తానే వినిపించే యక్షగాన రూపమే కలాపము. పాత్ర తన కధను వినిపిస్తూంటే సూత్రధారుడు 'హంగు ' చేస్తాడు; కధాసంధి, హాస్యము, చెలికత్తె మొదలైన పాత్రల వాచికము చెప్పుతాడు. పూర్వము ఒక్కపాత్రే రంగషలం మీద్ ఉండేది. తక్కిన పాత్రలు వాచికము సూత్రధారుడు చెప్పేవాడు. భామాకలపంలో కృష్ణ పాత్ర రంగష్తలం మీదకు వచ్చేదికాదు. కలాపంలో ఆ పాత్రను రంగస్థలం మీదకు తీసుకొని వచ్చినారు.

కధానాయిక తన కధను తానే వినిపించడంవల్ల రచనా క్రమంలో కొద్ది మార్పు వచ్చింది. పాత్ర తన పేరు, పుట్తు పూర్వోత్తరాలు తెలిపే ప్రవేశమవును పాడుకొంటూ తెరవెడలి వస్తుంది. యక్షగాన ప్రబంధంలోని జంపెలు, త్రిపుటలు మొదలైన దేశ చందస్సులు బదులు దరువులు, కీర్తనలు ప్రవేశించినవి.

ఈ రూపము ఏకపాత్రాభినయ రూపము. శ్రీగదితమవంటిది. ఈ ఏకపాత్రాభినయ కలాపాలు శ్రీనాధుని కాలం నాటికే వర్ధిల్లుతున్నవని "భీమఖండం" లోని "సానిఈశానియై" అనే ప్రయోగంవల్ల తెలుస్తున్నది.

భామాకలాపంలో సత్యభామ తనమీద కృష్ణుడు అలిగి చక్కాపోయిన వృత్తాంతము తన చెలికత్తెతో ల్చెప్పుకొంటుంది. భామాకలాపము, గొల్లకలాపము, చొడిగాని కలాపము--ఇవి ఈ కలాపరూపానికి చక్కని ఉదాహరణలు. సిద్ధేంద్ర యోగి కలాప రచనలకు ఆధ్యుడని చెప్పవచ్చు.

బుర్ర్రకధ

కాలగతిలో రూపాంతరముపొంది ప్రత్యేకశాఖగా వర్ధిల్లుతున్న యక్షగానప్రబంధ విశేషమే బుర్రకధ. కధకుడు వాయించే తంబురా బుర్రనుబట్టి ఈ పేరు దీనికి వచ్చింది. దీనిని "తంబుదానపాట" అని కూడా అంటారు.