పుట:RangastalaSastramu.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపకధ

ఉపకధా నిర్వహణలో షేక్స్ పియర్ ప్రతిభ అతని కీంగ్ లీర్ నాటకంళొ గోచరిస్చుంది. లీర్ నాటకం చరదువుతూంటే ఆనాటకంలొ రెందు వేరువేరు కధలున్నవని అనిపించదు. ఒకే కధ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. రెందు కధలు అట్లా ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయినవి. ఈ నాటకంలో పొందిక అంటే ఏమిటో స్పపష్టమవుతుంది. అయితే షెక్సిపియర్ నాటకాలలొ ఉపకధా ప్రయోగము చెబ్బరిన్న నాటకాలు లేకపోలేదు. నాలుగవ హెన్రీ-నాటకంలో హెన్రీ-హాట్స్ పర్ ప్రధానకధకు ఫాల్ స్టాప్ ఉపకధకు లంకెలేదు. రెందువిడివిడిగా నడిచినవి. అంతేకాదు; ఫాల్ స్టాప్ కధ ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే ప్రధాన కధను మరుగు పరుస్తుందికూడా.

సంసృత రూపకాఅలొ ఉపకధా ప్రయోగరక్షతకు పేరొందిన రూపకముమృచ్చకటిక. ఇందులో ప్రధాన కధ వసంతసేనా వాసవదత్తుల ప్రణయము. ఇక ఉపకధలు మూడున్నవి- 1.ఆర్యకుని కధ 2.సంబాహకునికధ 3.శర్విలకునికధ. ఈ ఉపకధలు ప్రధానకధతో పెనవేసుకొనిపోయి, దానికి తోడ్చడుతూ ఫలసిద్ధికి ఏకోన్ముఖంగా నడిచినవో చూద్దాము.

1.ఆర్య;కునికధ: రాజభటుల బారినుంచి తనను తప్పించినందులకు కృతజ్ఞతా సూచకంగా ఆర్యకుడు తాను రజుకాగానే చారుదత్తుని మరణ శిక్షను రద్దుచేసినాడు: వసంతసేనను వధూశబ్దంతో సత్కరించినాడు. ఈ విధంగా ప్రధాన కధాంశానికి ఆర్యకుని ఉపకధ దోహదము చేసింది.

2.సంవాహకునికధ: వసంతసేన సంవాహకుని కధ: వసంతసేన సంవాహకుని అప్పులవారి బారినుంచి రక్షించినది. శకారుడు ఆమెను మెడ నులిమి పారవేసిపోగా ఈ సంవాహకుడే ఆమెను రక్షించిల్నాడు. వధ్యభూమి దగ్గరకు ఆమెను తీసుకొనివెళ్ళి , చారుదత్తుని నిర్ధోషిత్వము నిరూపితమవడానికి తోడ్పడినాడు. అసలిది ఒక ఉప అనే బావమె తట్టదు.

3.శర్విలకునికధ: శర్విలకుడు చారుదత్తుని ఇంటిలోనుంచి వసంతసేన దాచుకొన్న నగలను దొంగిలించినాడు. అవి తిరిగి వసంతసేన దగ్గరకు చేరుతవి. ఆ నగలకు బదులు చారుదత్తుడు ఆమెకు రత్నాలహారము పంపినాడు. ఆ రత్నాలహారమే వసంతసేనాచారుదత్తుల సమాగమానికి దారితీసినది.