పుట:RangastalaSastramu.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాచికవ్యంగ్యము: వొక్కొక్కప్పుడు ఒక పాత్రయొక్క వాచికంలో రెండర్ధాలు గర్భీకృతమైఉంటవి. సందర్బాన్నిబట్టి ఎదుటిపాత్ర అందులోని ఒక అర్ధాన్నే గ్రహిస్తుంది; ఇంక రెండవ అర్ధము ప్రేక్షకులకు స్పురించిదానిని సూచిస్తుంది; లేదా పాత్ర అంతర్యాన్ని తెల్పుతుంది; లేదా రెంటినీ ద్యోతకము చేస్తూంటుంది.

కోలాచలం శ్రీనివాసరావుగారి 'రామరాజు చరిత్ర ' లో రామరాజు వచ్చికోట యుద్ధానికి బయలుదేరేముందు పఠానీ రుస్తుంకు సైన్యాధిపత్యమిచ్చినాడు. అప్పుడు పఠానీ కృతజ్ఞత తెలుపుతూ-

కలనికి జొచ్చువేళ జ్భటకాండము నన్గొనియాడజేసెదన్
తెలియనె నీకుమారకుడ నేనయి; సర్వము యుద్ధభూమిలో
వెలియగనౌగదా యిపుడు తెల్పగ నేమె ప్రయోజనమ్ము నీ
కలకడొలంచి శాశ్వతసుఖం దొనగూర్చెద నీకు నమ్ముమీ!

అంటాడు.

ఈపద్యంలోని "నీకుమారకుడ" "శాశ్వతసుఖం బొనగూర్చెదమీకు" అనే మాటలలో రెండర్ధాలు స్పురిస్తాయి. సందర్భాన్నిబట్టి రామరాజు 'నీతనయుడను ' యుద్ధంలో జయించి మీకి శాశ్వతమైన సుఖమొనగూరుస్తాను " అనే అర్ధాలనే తీరుకొంటాడు. కాని ఆ మాటలలోనే "మీకు కుమారకుడనై శాశ్వతసుఖము (మరణము) ఒనగూర్చెద" అనే అర్ధం కూడా గర్భీకృతమై ఉన్నది. ఈ రెండో అర్ధము పఠానీయొక్క అంతర్యాన్ని-అంటే రామరాజును యుద్ధంలో దొంగచాటుగా చంపవలెననే నిశ్చయాన్ని రెలుపుతుంది; భావిని సూచిస్తుంది. ఈ రెండర్ధాల మాటలకు పఠానీ నోట రచయిత పలికించడం వాచిక వ్యంగ్య్హానికి ఉదాహరణ.

ఒక్కొక్కప్పుడు పాత్ర యధాతధంగా ఒక అర్ధంలో మాటాడిన మాటలు బావినిసూచిస్తూఉంటవి. దీనినే భావిసూచక వ్యంగ్యమంటారు. హరిశ్చంద్రనాటకంలో హరిశ్చంద్రుడు యధాలాపంగా "కొడుకా .. ... కడకీనాటికిగాలసర్పమునకున్ గైకోలు గావించుటన్" అంటాడు. ఇక్కడ అనాలోచితంగాపలికిన 'కాలసర్పమునకుంగై కోలు గావించుటన్ ' అన్నమాటలు నిజమై, లోహితుని పాముకరుస్తుంది. లోహితుని పాము కరుస్తుందనే విషయము ప్రేక్షకులకు ముందుగా తెలియడంవల్ల చమత్కృతి జనిస్తుంది.