పుట:RangastalaSastramu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధంగా ఈ మూడు ఉపకరణలు ప్రధానకధతో పెనవేసుకొని, దానిపుష్టికి దోహదముచేస్తూ, ఏకోన్ముఖంగా పయనించి వసంతసేనాచారుదత్తుల సమ్మేళనానికి హేతువులైనవి.

సంస్కృత లాక్షణికులు చెప్పిన పరాక ప్రధానకతకు దోహదముచేస్తూ దానితోపాటు చాలాదూరౌ పయనిస్తుంది. కాని, ప్రకరి మధ్యలోనె అంతరించి పోరుంది, వివరాలకు సంస్కృత రూపక రచనా విధానము చూడవలె.

అంక రంగ విభజన (Division into Acts and Scenes)

కధావిన్యాస ప్రణాళిక సిద్ధంగానే రచయితకు అంక, రంగ విభజన సమస్య ఎదురవుతుంది. రూపకాలలో పరోక్షంగానో, ప్రత్య్హక్షంగానో అంక విభజన ఉండటం చూస్తూనేఉన్నాము. రూపకమంతా విచ్చేదంలేకుండా ధారావాహికంగా నడపడమా లేక అంకాలకింద, రంగాలకింద విభజించడమా విభజించితే ఏప్రాతిపదికమీద విణజించడం అనే అంకాలు తెలుసుకోవడం అవసరము.

ప్రాచెన గ్రీకునాటకాలలో విచ్చేదంలేకుండా ధారావాహికంగా రూపకము సాగిపోతున్నట్లు కనిపించినా, సూక్షంగా పరిశీలిస్తే రూపకము 5 భాగాలుగా విభజితమయినట్టు గోచరిస్తుంది. రూపక ప్రారంభంలో పాత్రలు ప్రవేశిస్తాయి, ఒక సన్నివేశాము లేదా ఒక డృశ్యము పూర్తికాగానే నిష్కమిస్తాయి. అప్పుడు బృందగాయకులు పాటలు పాడుతారు. తిరిగి పాత్రలు ప్రవేశించి మళ్లీ నిష్క్రమిస్తాయి. ఇట్లా రూపకము ఆసాంతమూ జరుగుతుంది. తెర ఉపయోగించక పోవడం, బృందగాయకులు రంగస్థలంనుంచి వెళ్ళిపోకుండా ఈ విభాగాలను అనుసంధిస్తూ ఉండటం మూలంగా రూపకము విచ్చేదంలేకుండా ధారావాహికంగా నడిచినట్లు అనిపిస్తుంది. కాని యధార్ధానికి విచ్చేదము జరుగుతూనేఉంది. ఇట్లా విచ్చేదము గరగడంవల్ల ఏర్పడిన విబాగాలకే తరవాత తరవాత అంకాలు అనే పేరు పెట్టినారు. మొట్టమొదటగా పాశ్చాత్యులలో అంకవిభజనచేసిన రూపకము రచించినది ఎగాతా (Agathon). ఇతడు ది ప్లవర్ (The Flower) అనే రూపకంలో అంక విభజనచేసి ఈపద్ధతికి దారితీసినారు. కాని దీనిని వ్యాప్తిలోకి తీసుకొని వచ్చినవాడు సెనెకా (Seneca) అనే రోమన్ నాటకకర్త బృందగానాలను ఎత్తివేయడంలో అంకవిభజన విస్పష్టరూపము దాల్చినది.