పుట:RameshwaraMahatyamu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. కరిచర్మాంబరునకువర|
   సరసిజధృతశంబరునకు-సజ్జనరక్షా|
   వరకరుణాపాంసునకు:
   న్నరకభయధ్వాంతభంజ-నపతంగునకున్|| (6)

క. సోమునకుభక్తనిహిత|
   ప్రేమునకున్ భద్రిరాజు భీమయసుతమ|
   ల్లామాత్యమానసాంబుజ|
   ధామునకుమనిరుపమాన-తతధామునకున్|| (7)

క. దృహిణాదివిబుధసుతునకు|
   దుహినాంశుకళావిభూషి-తనకున్ లక్ష్మీ|
   సహితగురుజానపల్లీ|
   మహితని వేశునకు జెన్న-మల్లేశునకున్|| (8)

వ. సభక్తిసమర్పితంబుగా నాయొనర్పం బూనిన రామేశ్వర మహాత్మ్యంబునకు గథావిధంబెట్టిదనిన.

కధాప్రారంభము

శా. శ్రీమత్కాంచనగర్భసన్ని భమహ-ర్షిస్తోమధామంబుసు|
   త్రామస్తుత్యవిచిత్రవైభవగుణా-ధారింబుసద్గోమతీ|
   నామద్వీపవతీసమంచితమమం-దజ్ఞానలక్ష్మీమయ|
   క్షేమోద్దామము నైమిశంబనవన-శ్రేష్ఠంబువొల్చున్ ధరన్|| (1)

సీ. శాంతమానసముక్త-జాతిమత్సరబద్ధ,
                సఖ్య నానాసత్త్వ-సంకులంబు|
   సంయమిదత్తఘా-సగ్రాసమాంసల,
               చారుసారంగికి-శోరకంబు|
   తాపసేశ్వరనిరం-తరయాగహోమధూ,
               మస్తోమవృతనభో-మండలంబు|