పుట:RameshwaraMahatyamu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   చిత్తనిగ్రహంబు-జేసినిశ్చలభక్తి|
   పూర్వకముగవినుడు-పుణ్యులార|| (13)

సీ. కడగి సేతువు జేరం-గానెముక్తిలభించు,
                భవకేశవులయందు-భక్తిపుట్టు|
   ద్రివిధకర్మంబుసి-ద్ధించునచ్చోటన,
                నించుకంతయుసంశ-యించవలదు|
   మనుజు డెవ్వడుజన్మ-మధ్యంబునను సేతు,
               బంధంబు బొడగాంచు-భక్తితోడ|
   ధన్యతనతడుమా-తా పితృవంశకో,
               టిద్వయోపేతుడై ఠీవిమెఱయ|

గీ. బ్రహ్మపదముననొక్కక-ల్పమువసించు|
   ముక్తుడుగు దారలుపరాగ-ములుగణింప|
   శక్యమగు సేతుదర్శన-జనిత పుణ్య|
   మహిపతికినైన లెక్కింప నలవిగాదు|| (14)

వ. సేతుబంధంబు సకలదేవతాస్వరూపంబు గావున దానింజూచిన వాని పుణ్యంబు లెక్కింప నెవ్వనివశంబు సేతుదర్శనంబు జేసిన నరుండు సర్వయాగకరుండు, సర్వతీర్థస్నాతయు, సర్వతపంబులుం జేసినవాడు సేతువునకుం జనుమని పలికిన పురుషుండు సేతువునకుంజనిన పుణ్య ఫలంబునొందు. (15)


క. ధరసేతుస్నానముగల|
   గురుపుణ్యుడుసప్తకోటి-కులములతోడన్|
   హరిభవనంబునకుంజని|
   సురచిరగతిముక్తిబొందు-సుప్రతులారా|| (16)

గీ. మానవుడు సేతువునుగంధ-మాదనంబు|
   బ్రీతిరామేశు దలచుచు-బితృకులములు
   లక్షకోటులుగూడిక-ల్పత్రయంబు|
   శంభుపదముననుండిమో-క్షంబు గాంచు|| (17)