పుట:RameshwaraMahatyamu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   మునిరాజకన్యకా--జనకృతో ద్వాహవై,
                భవసుశోభితలతా-పాదపంబు|

గీ. వేదశాస్త్రేతిహాసప్ర-వీణకీర|
   శారికా కేకికోకిల-భూరివాద|
   నాదమేదురమూర్జితా-నందబోధ|
   కారణమువొల్చునైమిక-కాననంబు|| (2)

వ. అందు (3)

సీ. అష్టాంగ యోగవి-ద్యాసమాసక్తులు,
               బ్రహ్మవిజ్ఞానత-త్ప రులులోక|
   పావనుల్ నిశ్చల-బ్రహ్మవాదులుమహా,
               త్ములుముక్తికాములు-దురితహరులు|
   ధర్మవేదులుసూనృ-తవ్రతులనసూయు,
               లపగతక్రోధులు-విపులమతులు|
   విజితేంద్రియులుజగ-ద్వినుతశీలురుసర్వ,
               భూతదయాపరు-ల్భువనహితులు|

గీ. శౌనకాదిమునీశ్వరుల్-జలజనాభు|
   బరమపురుషుసనాతను-భక్తితోడ|
   బూజసేయుచుసలిపిర-ద్భుతతపంబు|
   పుణ్యతమమగు నైమిశా-రణ్యమునను|| (4)

ఆ. భావితాత్ముడైన-బ్రహ్మర్షి కుంజరు|
   లిరువదాఱు వేవు-రెంచిచూడ|
   వారిశిష్యజనుల-వారిశిష్యులనెల్ల|
   సంఖ్య జేసి పలుక-శక్యమగు నె|| (5)

క. వారొక్క నాడుగ మియై,
   భూదిగతిన్ భోగ మోక్ష-ములకును పాయం|
   బారూడి నెఱుగ దలచియు|
   దారకళాగోష్ఠిజేసి-రన్యోన్యంబున్|| (6)