పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మతములో నుండుటవలనఁ బ్రయోజనమేమి?ఉండకపోవుటవలన హాని యేమి? ఆ దినము శవ మింటనుండి కదలునప్పటికిఁ బగలు రెండుజాము లయినది; దహనముచేసి మరల వచ్చునప్పటికిఁ బడమట నాలుగు గడియల ప్రొద్దున్నది. తరువాత విధ్యుక్తముగా సంచయనము మొదలయిన యపరకర్మ లన్నియు జరిగినవి.

మునుపటివలె రాజశేఖరుఁడుగారిని చూచుటకయు బంధువులను మిత్రులును నంతగా వచ్చుట మానివేసిరి; వీధిలో గనఁబడి నపుడు సహితము చూడనట్టు తొలగిపోవుటకే ప్రయత్నించుచు, విధి లేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి. పూర్వ మాయన మాటాడునపు డెల్లను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనఁబఱుచు శిర:కంపములను మాత్రము చేయుదు నాతని మాటలను మందహాస ముతో వినసాగిరి. కొన్నాళ్ళకా శిరకంపములును మందహాసములును పోయి యూరక యూకొట్టుట క్రింద మాఱినవి; అటుపిమ్మట నా యూకొట్టుటలు సహితము నడగి హితబోధలు బలిసినవి. కాలక్రమ మున హితబోధలు సహిత మడుగంటి యొకరీతి పరిహాసములుగా బరిణమించినవి. రాజశేఖరుఁడుగారును దారాపుత్రాదులును ధనము లేనివారయినను తామొక దుష్కార్యమునకయి ధనమును దుర్విని యోగము చేయలేదుగదా యని మనసులో నొక విధమయిన కైర్యము నవలంబించి యున్నదానితోనే తృప్తి వహించి యుండగా, వారి సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందఱు మిత్రులని పేరుపెట్టు కొనివచ్చి వారును వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారి నెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి: రాజశేఖరుఁడుగారు చేసిన వ్యయమును బూర్వము దాతృత్వమని వేయినోళ్ళ బొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరి; ఆయన వలన బూర్వ మెన్నివిధములనో లాభములను బొందినవారు సహితము రాజ శేఖరుఁడుగారు వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితోఁ జూపి యీయనయే తన ధనమునంతను బాడుచేసుకొని జోగియైన మహాను