పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొనియాడఁకొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో 'వీఁడె నగ దీసిన దొంగ; అప్పుడు వెనుక నిలుచున్నా' డని వానిని నిందింప సాగిరి, సీత వచ్చి కాసుల పేరు పోయినప్పుడు సర్విగాఁడు పండ్లు చేతిలోఁ బట్టుకొని మా వెనుక నిలువఁ బడినాఁడని చెప్పెను. అందు మీద నందఱును నగ హరించిన వాఁడు చాకలి సర్విగాఁడుతప్ప మఱి యొకఁడు కాఁడని నిశ్చయించిరి. ఇంటనున్నవారును రాజశేఖ రుడుగారునుకూడ ఆ ప్రకారముగానే నమ్మిరి. ఆ వస్తువును శీఘ్ర ముగాఁ దెచ్చి యిమ్మని యడిగినప్పుడు, ఆ చాకలివాఁడు కంటికి నేలకు నేకధారగా రోదనముచేయుచుఁ దా నేదోషము నెఱుఁగనని బిడ్డలమీఁదను భార్యమీఁదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యది యంతయు దొంగయేడుపని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున భయమున వాని నెన్నివిధముల నడిగినను వాఁడు తాను నిరపరాధి ననియే చెప్పి యేడ్చుచు వచ్చినందున, హరిశాస్త్రులు రాజశేఖరుడుగారిని చాటునకు 'మాట' యని పిలుచుకొనిపోయి 'మీ సెలవయినపక్షమున వీనికి ప్రయోగముచేసి పోయిన వస్తువును దెప్పించెద' నని చెప్పెను. వాఁడు చిన్నతనమునుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవాఁ డయినందున వానికేహానియఁ జేయ నొడఁబడక రాజశేఖరుఁడుగారు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి నని యేడ్చుచు నింటికిఁ బోయెను. మొదట సిద్ధాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వని పేరు వ్రాయమనియే, అతఁ డమ్మవారి పెట్టెను దెచ్చుమిషమీద వెలుపలకుఁబోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతోఁ "చాకల సరడ"ని యక్షరజ్ఞానము చక్కగా లేక పోవుటచేత వా ఒత్తు (వ) పోఁ గొట్టి వ్రాసి యాఱ పెట్టి పెట్టెలో బెట్టుకొనివచ్చెను. రాజశేఖరుఁడుగారి కుమారుఁడు కాగితమును తీసికొనివచ్చినప్పుడు తా నాపేరును వ్రాసిన కాగిత మంత ముక్కను జింపుకొని తక్కినదాని నిచ్చివేసి, దానిని పెట్టెలోఁ బెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిఁ