పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిసెను. అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమానపడలేదు. ఆ కాగితముమీఁద హారతికర్పూరముతో బీజా క్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకేకాని మఱి యొకందునకుఁ గాదు. తరువాత సాంబ్రాణిపొగలోను కర్పూరపు దీపముమీఁదను పొగచూరఁ బెట్టుట మున్నుకనబడకుండ నున్న యక్షరములు స్ఫుటముగాఁ గనఁబడునట్టు చేయుటకయి కావించిన తంత్రము. ఈ ప్రకారముగా తన మంత్రప్రభావముచేత శాస్త్రు లంతటి ఘనకార్యమును జేసినందునకయి వస్తువు దొరకకపోయి నను రాజశేఖరుఁడుగా రాతని కొక ధోవతుల చాపును కట్టబెట్టి నాలుగు రూపాయిల రొక్కము నిచ్చిరి. ఇంటికిబోయినతరువాత హరిశాస్త్రులను సిద్ధాంతియు వానిని సమభాగంబులుగాఁ బంచు కొనిరి.

ఆ మఱునాఁడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యొక్కతెయు పడమటింటి పంచపాళీలోఁ గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే. యింకను మగడు రాఁడాయెనే యని తలపోయుచు వస్తువు పోయినందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొక చిన్నవాఁడు లోపలికివచ్చి చేతిలోని బట్టలమూఁటను క్రిందఁబడ వైచి రుక్మిణి మొగము వంకఁజూచి పెద్దపెట్టున నేడ్చెను. అది చూచి రుక్మిణి సంగతి యేమో తెలిసికొనకయే తానును నేడ్వఁజొచ్చెను. ఆ రోదన ధ్వని విని యింట నున్నవా రందఱును లోపలినుండి వరు గెత్తుకొనివచ్చి యేమియని యడిగిరి. అప్పు డాచిన్నవాఁడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణిమగఁడు నృసింహ స్వామి కాశీనుండి వచ్చుచు త్రోవలో జగన్నాధమువద్ద పుష్యశుద్ధ నవమినాఁడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు,దహనాదికృత్యము లను తానే నిర్వహించితిననియుఁ జెప్పెను. ఆ మాటలు విన్నతోడనే ఇంటనున్నవా రందఱును నొక్క సారిగ గొల్లుమని యేడ్చిరి.ఆ యాక్రం దనధ్వని విని చావడిలోనున్న రాజశేఖరుఁడుగారును పొరుగిండ్లవారును