పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యొకరొక రేవచ్చి కచేరీచావడిలో రత్నకంబళములమీఁదఁ గూర్చుం డగాఁ దామును దక్షిణపు గోడకానుకొని యెండలోనుండి నడచి వచ్చిన బడలికచేఁ బట్టిన చెమ్మట పోవ ను త్తరీయముతో విసరు కొనుచుఁ గూరుచుండిరి. అప్పడు నంబిరాఘవాచార్యుఁడు నామ ముల తిరుమణి బెత్తికలు లేవనెడమచేతితో నద్దుకొని చేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగముమీఁద జూడ్కి నిగిడించి, "దేవర వారి కీనడుమ స్వామిమీఁద కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది" అని యొకచిఱునవ్వు నవ్వి నిలువఁబడి బట్టలోనున్న గన్నేరుపూలతో మాలనుదీసి చేతిలోఁ బట్టుకుని "స్వామివారియందు బరిపూర్ణ కటాక్షముంచవలెను" అని వినయముతోపఁ బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను

రాజశేఖరుడుగారు భక్తితోఁ బుచ్చుకొని, "యీ మధ్య మన జనార్ధనస్వామివారికి జరగవలసిన యుత్సవము లేమయిన నున్నవా?' ఆని యడిగిరి,

రాఘ__పదియేను దినములలో మార్గశిర శుద్ధ చతుర్ధశినాఁడును, పూర్ణిమనాఁడును వరుసగా తిరుమంగయాళ్వారియెుక్కయు, తిరుప్పా ణాళ్వారి యొక్కయు తిరునక్షత్రములు వచ్చుచున్నవి. అప్పడు విశేషోత్సవములు జరగవలసియున్నవి. నెలదినములలో ధనుర్మా సము వచ్చుచున్నది. ఆ నెలదినములను స్వామికి నిత్యోత్సవము లను సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి. ధనుస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాఁడు తొందరడి ప్పొడి యాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది. ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.

రాజ__నిత్యమును స్వామికి బాలభోగమును నందాదీపమును క్రమముగా జర గుచున్నవా?

రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రెండు రూపాయలును బాలభోగమునకుఁ జాలకున్నవి, ఇప్పుడు స్వాము లధికముగా వచ్చుచున్నారు. నందాదీపము క్రిందఁ దమరు దయ

46