పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిమ్మిట్లు నిర్బంధ పెట్టుచున్న సంగతి మనవి వ్రాసికొన్న యెడల మిమ్ము తక్షణమే విడుదల చేయుదురు. కాగితము మొదలయినవి నేను తెప్పించి యిచ్చెదను.

అని పాపయ్య కాగితమును కలమును తెప్పించి యిచ్చెను. తోడనే రాజశేఖరుఁడుగారు విజ్ఞాపనపత్రిక నొకదానిని వ్రాసి మడఁచి జిగు రంటించి పయిని చిరునామా వ్రాసియియ్యఁగా పాపయ్య యొక మనుష్యునిచేత దానిని రాజుగారి కంపెను. కాని యాయనయొద్దనుండి యొక యుత్తరువుగాని విమర్శ చేసి న్యాయము దయచేయు సూచనలు గాని రెండు మూడు దినములు కడచినను రాలేదు. రాజబంధువు మీఁదజేసిన విన్నపము గనుక బదులు రాదని రాజశేఖరుఁడుగా రూరకుండిరి.

సీత నెత్తుకొనిపోయిన మఱునాఁడు ప్రొద్దుననే రాజుగారు చెఱసాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను. తరువాత గొంచెము సేపటికి రామరాజు రాజశేఖరుఁడుగా రున్న తావునకు వచ్చెను.

రాజ__రామరాజుగారూ! నా తప్పును క్షమింపవలెను. మీ రా రాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహోపకారమయినది. నేను సంగతిని తెలిసికోలేక మిమ్ము నిష్కారణముగా కానిమాట లాడి నాఁడను.

రామ__మీకు నేను జేసియున్న యుపకారమునకు నన్నటు వంటి మాట లనవలసినదే. ఇక నెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు.

రాజ__నాయందు కరుణించి మీ రాసంగతిని మఱచిపొవలెను. మంచి సంబంధము చెడిపోయెఁగదా యని యాసమయములో నొడలు తెలియక యేమో యన్నాను. నన్ను మన్నింపుడు.

రామ__రాజుగారు చెఱసాలను జూడ బయలుదేఱినారట. నేను వేగిరము పోవలెను.

అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండు గడియలకు వెండిబిళ్ళ బంటొకఁడువచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి,