పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 నీలా__సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీ రిక్కడకు వచ్చినారేమి?

సుబ్ర__తమ దర్శనము నిమే_త్తమే.దొడ్డిలో నేమి చేయుంచు చున్నారు?

నీలా__విత్తనములు చల్లించుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమి గింజలు జల్లింతునాయని యాలోచించుచున్నాను.

అని యా తొందరలో తన విషయమైన బహువచన ప్రయో గమును మఱచిపోయి తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటా డెను. సుబ్రహ్మణ్యము మాఱుమాటాడక భటులతో లోపల జొర బడి పెట్టె లన్నియు దీయించి పరీక్షింపఁగా వానిలో మున్ను తమ లోపల బైరాగి యెత్తుకొనిపోయిన వస్తువులును గానఁబడెను గాని రాజుగారి సొత్తేమియుఁ గనపడలేదు. తన సొమ్ము దొరుకుటంబట్టి నీలాద్రిరాజే దొంగయని నిశ్చయముజేసి వస్తువులు భూమిలో పాతి పెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండా మఱుగుపఱుచుటకయి దొడ్డి యంతయుఁ ద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి బొంకు చున్నాఁడని యూహచేసి యతఁడు భటులచేత దొడ్డినంతను త్రవ్విం చెను; అందొకచోట రాజుగారిలోపలఁబోయిన సొత్తంతయు గవ్వ యయినఁబోకుండ మొలలోతు భూమిలో గానఁబడెను. వెంటనే కూలి వాండ్రచేత సొమ్మును మోయించుకొని నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకయి భటుల నియోగించి సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికి వెళ్ళి నడచిన సర్వవృ త్తాంత మును నివేదించి, కావళ్ళతో సొమ్మును ముందుబెట్టి దొంగల నొప్పగించెను; నీలాద్రిరాజును సేవకులను తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానముచేసి, తాను పెద్దాపురము రాజునకుఁ గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపఁ దన కధికారము లేదని దొంగలను రాజభటుల వశమున నొప్పగించి