పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మలూ-శవవాహకుల మూర్ఖవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు.

ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు గారు యీ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారు. జోస్యుల కామావధాని, ముష్టి సర్వశాస్త్రి, నంబి రాఘవాచార్యుడు, వామరాజు భైరవమూర్తి, బులుసు పేరయ్య సోమయాజి, మంచి రాజు పాపయ్య, నీళ్ళ కావిడి వెంకయ్య - వీళ్ళంతా నాటి సంఘానికి ప్రతీకలే.

పంతులు గారి మహా యశస్సుకు శరత్కౌముది రాజశేఖర చరిత్రము.[1]

జనవరి 10, 1969
హైదరాబాదు,
డా॥ అక్కిరాజు రమాపతిరావు
(మంజుశ్రీ)
  1. రాజశేఖర చరిత్రము గూర్చి ఇంకా వివరాలు తెలుసుకో దలిస్తే పీఠికాకారుని పరిశోధన గ్రంథం "వీరేశలింగం పంతులు-ఒక సవిమర్శ పరిశీలనము" చూడవచ్చును.