పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రకు మూలం ఆని చెప్పవలసిన 'ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' ప్రపంచంలోని నాగరిక భాషల్లోకి ఆన్నింటి లోకి ఆనువదింపబడింది. ఆయితే తెలుగులోకి కాక, ఆనుసరణగా వచ్చింది. తెలుగు నవలలో సాంఘిక విమర్శ ప్రధానస్థానం ఆక్రమించింది.

రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము ఆ కుటుంబం పడిన ఆష్టకష్టాలన్నింటికీ మూలం, సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు ఏ విధంగా ఆమాయకులను బాధించి, తాము బాగుపడుతున్నారో, అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫు టాచారాల వల్ల కొన్ని కుటుంబా లెట్లా నాశనమై పోతున్నాయో రాజశేఖర చరిత్రంలోని సంఘటనల వలన తెలుసుకోవచ్చును. ప్రతి సంఘటనా - వొక సాంఘిక దురా చారాన్నీ, వొక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో పంతులుగారు యీ నవలలో కల్పించారు. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, బొమ్మకంటి సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం, ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు శాంతి చేయడం - ఇంకా వీధి బడుల్లోని అక్రమాలూ, వంట

11