పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపురి, తిరువటేశ్వరుని పేట
౧౮౯౩ సం|| ఆగస్టు ౩౦ తేది.


ప్రత్యేకించి కొక్కొండ రాజశేఖర చరిత్రాన్ని పేర్కొన్నారంటే, దాని ప్రశస్తి ఆనాటికే ఎంత వ్యాపించిందో తెలుస్తున్నది.

గురజాడ ఆప్పారావుగారు తమ డైరీలో వొకచోట, రాజశేఖర చరిత్రను గూర్చి ప్రస్తావిస్తూ, గోల్డ్ స్మిత్ రచన కనుసరణ మనీ, ఇది బహుళ ప్రచారం పొందిన గ్రంథమనీ వ్రాసుకున్నారు.

పంతులు గారు వ్రాసిన నవలలలోనే కాక, వారి సర్వ సాహిత్య సృష్టిలోనూ ఆధుని కాంధ్ర వాఙ్మయంలోనూ, రాజశేఖర చరిత్రానికి విశిష్టమైన స్థానమున్నది. రాజశేఖర చరిత్రం వెలువడటంతో, ఆంధ్ర వాజ్మయంలోనే వొక ఉజ్జ్వలాధ్యాయం ప్రారంభమైనదని చెప్పాలి. ఈ నవల రచించే కాలానికి పంతులుగారి వయస్సు ఇరవై ఏడు ఏండ్లు, పుస్తకంగా వచ్చేటప్పటికి ముప్ఫై ఏళ్ళు. పంతులుగారి జీవితంలో రాజశేఖర చరిత్రం సరైన పరిష్కారాన్ని చూపటమే కాక, వారు సాధించిన పరమ ప్రయోజనానికి లక్ష్యప్రాయంగా కూడా వెలసింది. రాజశేఖర చరిత్రం రచించడానికి పూర్వం వీరేశలింగం గారు శృంగార నిరోష్ఠ్యనిర్వచన నైషధం, రసిక జనరంజనం, శుద్ధాంధ్రోత్తర రామాయణము, శుద్ధాంధ్ర భారత సంగ్రహము మొదలైన పద్య కావ్యాలూ, విగ్రహం మొదలైన వచన కావ్యాలు వ్రాశారు. ఈ నవల వ్రాసిన తరువాత మళ్ళా వెనుకటి గ్రంథాల వంటివి ఎప్పుడూ వ్రాయలేదు.