పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/124

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది


ఇట్లు కుమ్మరపేట పరశురామ ప్రీతి యగుచుండఁగా సత్రపు బ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకుఁ దీసికొని వచ్చి యిండ్లు కాలుటనుగుఱించి ప్రసంగింప నారం భించెను.

సత్ర__ఈప్రకారముగా రెండుజాములవేళ ఇండ్లెందుకు కాలి నవో కారణము మీకుఁ దెలిసినదా?

సుబ్ర__కుమ్మరావములు కాల్చునప్పుడు ప్రమాదవశమున నిప్పంటుకొని తాటాకులయిండ్లుగనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియందురు.

సత్ర__మీరు చెప్పిన రెండు కారణములును సరియయినవి కావు. ఈ గ్రామమున కేదో క్రొత్తగా నొకగ్రహమువచ్చి యీ ప్రకారముగా తగులబెట్టినదికాని వేఱుకాదు.

సుబ్ర__నీవు నాతోనే యిప్పు డిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి తెలిసికోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టిన దని నీవెట్లు రూఢిగా జెప్పఁగలవు?

సత్ర__మా గ్రామముసంగతి నాకుఁ దెలియదా? ఈ గ్రామ మేటేట వేసవికాలములో నాలుగుసారులు తగులబడును. ప్రతిపర్యా యమును గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగనంపు చుందురు. ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమున, వర్ఘకాల ములో నేల తగులబడకూడదు?

సుబ్ర__ఇండ్లుకాలుట గ్రహముచేతనే యయిన యెడల, ఒక సారి జాతరచేసి బంపిన గ్రహము మరలవచ్చుటకుఁ గారణమేమి? వర్షకాలములో ఇండ్లకప్పులు వానతో నానియుండును కనుక__

సత్ర__కారణములు గీరణములను నాకుఁ దెలియవు. నా కెప్పుడును యుపయుక్తలన్నఁ దలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము, ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగుచుండఁగా కన్నులార చూచినప్పడయినను నమ్మెదవు.

ఈ ప్రకారముగా సంబాషణ జరుగుచుండఁగా అగ్ని