పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హోత్రుడు తన చెలికాఁడగు వాయుదేవుని సాయముచే కుమ్మర పేటను సంపూర్ణముగా దహనము చేసి తృప్తిపొంది ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయిన వారును విచారించు చుండఁగాఁ గొందఱు చుట్ట కాల్చుకొనుటకు కావలసినంత నిప్పు దొరకినదనియు రేపు బొగ్గులు చవకగా దొరకగలవనియు సంతోషిం చుచుఁ బోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును సత్రపు బ్రాహ్మ ణునితోఁ గూడ బయలుదేఱి సత్రమును జేరెను. ఈలోపల నెవ్వరో రుక్మిణి యత్తవారియూరికిఁ బోవుచున్న బ్రాహ్మణుడొకడు సత్రము లోనికి భోజనమునకురాగా ఆమె దుర్మరణకథను జాబు వ్రాసి యు త్తరక్రియలను వేగిరము జరిగించుటకయి యాజాబు నతని చేతి కిచ్చి రాజశేఖరుఁడుగారు వియ్యంకునకుఁబంపిరి.

ఆ మఱునాఁడు పగలు రెండుజాములవేళ రాజశేఖరుడుగారు భోజనము చేసి వీధియరుగుమీఁద గూరుచుండియుండఁగా, ఆ దారిని తుడుములు డప్పులు మ్రోగుచుండఁగా కొందఱు దిండిమీఁద కుంభ మును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు నడచుచుండిరి; వారి వెను కను జనసంఘము మూఁకలకట్టి తమ చేతులలోని కఱ్ఱలతో త్రోవ పొడుగునను ఇండ్ల మీద కొట్టుచు బోవుచుండిరి. ఆ మూఁకలలో నుండి సత్రపుఁ బ్రాహ్మణుఁడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకఱ్ఱ పెట్టుకొని దేహ మంతటను జెమ్మట కాలువలు గట్ట వచ్చి సుబ్రహ్మణ్యము చేయి పట్టుకొని, "నిన్న నేను జెప్పినప్పు డబద్ధమంటివే, ఇప్పుడయినా నా మాట నమ్మెదవా?" యని క్రిందకు లాగెను.

సుబ్ర__ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది?

సత్ర__నిన్న చెప్పలేదా? ఇండ్లు కాల్చు గ్రహము గ్రామము నకు వచ్చినప్పుడు ఈ ప్రకారముగా చేయుదురు. ఒక చేతితో వేప మండయు రెండవ చేతితో పేవబె త్తమును పట్టుకొని ముందు నడుచు చున్న యతనిని జూచినావా !

సుబ్ర__పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతఁడుకాఁడా? చూచి నాను. ఆతఁ డెవరు?