పుట:Raajasthaana-Kathaavali.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాసంగుఁడు.

85


మాన మెక్కుడుగ నున్నదికానీ యాయభిమానావేశముచేత శత్రు రాజులయందు మంచిగుణము లేవైన నున్న వానిని మఱచిపోవక వానిని 'మెచ్చుకొనుచు నతఁడు వ్రాసిన గ్రంథములలో నెక్కు డౌదార్యమును జూపుచు వచ్చెను.

రాణా సంగున కంతకంటే సుగుణవంతుఁడు నింతకంటె పౌరుషశాలియు నగుశత్రువుం డెన్నఁడు దొరికి యుండలేదు. 'రెండు తెగల వారి కది మంచి యుద్ధమే. రాజపుత్రులందఱు తమ దేవాలయముల నెల్ల నేలమట్టముగఁ జేసి "దేవతావిగ్రహములఁ బగులఁగొట్టి పాడు చేసిన మ్లేచ్ఛులను తమకులదేవత యగుభవానిమాత తప్పక యడచి తమకు జయమును గలిగించు నని నమ్మి ధైర్యముగ నుండిరి మొగలా యీలు విగ్రహారాధనము చేయు పాపాత్ము లగుహిందువుల సంహరించుటకుఁ దోడ్పడుమని అల్లాను ప్రార్థించిరి. ఈ రాజపుత్ర మొగ లాయి ప్రభువులు తక్కినగుణములలో సమానులైనట్లే కైపునకు నల్లమందు మద్దతుబీల్చుటలోగూడ సమానులే. పదునైదుదినములవఱకు రెండు సైన్యములు యుద్ధ మారంభింపక నొక దాని నొకటి చూచుకొనుచు నేది ముందుగాఁ గయ్యమునకు దిగిన నేమి ప్రమాద మగునో యని శంకించుచు నూరకొనిరి. బేబరు సైనికులు కొంతవఱకు నిరుత్సాహులయి యుండిరి. ఏలయన వారు తమయాలు బిడ్డలను గృహములను బాసి చిరకాల మగుటచే నిండ్ల పై దృష్టులు బార మిడిమిడి యెండలుగాయు హిందూ దేశపుబయళ్ళను విడిచి తమ కొండ గేహముల 'కెప్పుడు పోవుదుమా యని బెంగఁగొని స్వదేశమునకుఁ దోడ్కొని పొమ్మని బేబరును బలవంత పెట్టిరి. వెనుక బేబరు పంపిన పదునై దువందల సైనికులలో హత శేషులు వచ్చి సంగుని సైనికుల పేరు విన్న గడగడ వడఁకునట్లు తక్కిన వారిని భయ పెట్టిరి. తురక శిబిరము నంటివచ్చిన జ్యోతిష్కు లెప్పుడు చెప్పినను నీచదశ నేగాని యుచ్ఛదశను జెప్పరై రి. అంగారకుఁ డప్పుడు పడమట నున్నందున వాని కెదుట దిక్కున