పుట:Raajasthaana-Kathaavali.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

రాజస్థానకథావళీ,


రందఱుఁ దరతరములనుండి పూర్వులు చేసినశూరకర్మములఁ దలంచి గర్వోద్దీపితులై యుండిరి, ఆ రాజకుమార రత్నములు క్రోత్త పెండ్లి కూఁతులను వరించునట్లు మృత్యు దేవతలను గూడ వరించు విద్యను నేర్చికొని వీరపురుషునకు నంతఃపురమున హంసతూలికాతల్పము శాశ్వతమయిన పాన్పు కాదనియుఁ దమయా యుధములచేఁ దెగిన పగతుర కళేబరములతో నిండిన యుద్ధ భూమియే శాశ్వతమయిన పాంపనియు నమ్మిన మహాశూరులు.

ఇక రెండవపక్క నున్నవాఁడో పదునొకండేండ్ల ప్రాయముననే రాజ్యమున కభిషిక్తుఁడైనవాఁడు, పర రాజుల పీడవలన పితృ పితామహార్జితమయిన 'రాజ్యమును గోల్పడి దేశద్రిమ్మరియై చిరకాలము గడపినవాఁడు. అదివఱకు సమర్కందునగరమున నతఁడు రెండు సారులు సింహాసన మెక్కి రెండుసారులు దానిని వదలుకోవలసినవాఁడయ్యు నెప్పటికైనా దాని మఱల సంపాదించి మఱి చావవలయునని తలంచుచుండువాఁడు. సంగునివలెనే యిల్లువాకిలి లేక గొడ్లఁగాసి కొనియు కొండల వెంబడి తిరిగియుఁ గొంతకాలము పుచ్చి యెట్టకేలకు కాబూలు' నగరమును బట్టుకొని దానికి బ్రభువై యంతకన్న మంచి దేశమును స్వాధీనము చేసికొనుటకై యదను వెదకుచున్న వాఁడు. ఈ యుద్ధమునాఁటికైన నతఁడు సడివయస్సును దాఁటినవాఁడు గాక మంచి శరీర దాఢ్యముఁ గలిగి శత్రు దుర్నీక్షుఁడై వెలయుచుండెను. బలముగల మనుష్యులనిద్దఱను చెరియొక చంకఁ బెట్టుకొని కోట గోడలపైఁ బరు గెత్తుటకును వానికి సామధ్యముఁ గలదు, అతఁడెప్పుడు గుఱ్ఱపుజీనుమీఁదనే కాఁపురము చేసిన వాఁడని చెప్పవచ్చును. మాగ౯మధ్యమున నడ్డమువచ్చిన ప్రతినదిని నతఁడు నిండువరదలో నైన ననాయాసముగా నీదుకొనిపోవునేగాని దోనెలనై న నెక్కువాఁడు కాఁడు అంతటి శూరాగ్రేసరుఁడయ్యు 'బేబరు పారశీక భాషలో మృదువయిన కవిత్వము చెప్పఁగల రసికుఁడు. అతనికి స్వమతాభి