పుట:Raajasthaana-Kathaavali.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాసంగుఁడు.

83


లో బేబరు బయానాకోటను విడిపింపుమని పదునై దువందల సైనికుల నంపెను. కాని యా సైనికులలోఁ గొందఱుమాత్రమే బతికివచ్చి రాజపుత్ర వీరుఁడు సామాన్యుఁడు కాఁ డనియు జీతములకోఱకే యుద్ధములు నేయు ఢిల్లీ సైనికులకును రాజపుత్ర సైనికులకును జాలభేదము కదలదనియుఁ జెప్పిరి. మీవారు రాజ్యమున కుత్తరఫుసరిహద్దు గానుండ వలయునని సంగుఁడు కాణ్వాహ యను గ్రామమున గొప్ప మేడ గట్టించెను.

అమేడ యెదుటనే బేబరు శిబిరము వేయించెను. ఫిరంగుల బండ్లను సరకులబండ్లతో గలిపి గోనెసంచులతో గట్టి సేనలో మొదటివరుస నమర్చి వాని వెనుక సేనను నిలిపెను. ఆ బండ్లు చాలనిచోట్ల కాఁపుదల నిమిత్తము గోతులు త్రవ్వించెను. వాని ఫిరంగులలో జయఫిరంగి యను పేరనొక ఫిరంగి యుండెను. దానిని ఉస్తాదా యను సేనానాయకుఁ డొకఁడే మిక్కిలి నేర్పుతో నుపయోగించు చుండునఁట. అతనిశక్తి యేమోకాని యొక్కమా రాతఁ డాఫిరంగిని దినమునకు బదియాఱు సారులైనను బ్రయోగింపఁ గలిగి యుండెనఁట. ఆ యుద్ధ ముభయ కక్షులవారికిఁ గడు బాధకరముగ నుండెను; కాని పై నుండి చూచిన వారికి మిక్కిలి వినోదముగ నుండెను. ఉభయులు నోకరి కొకరు తీసిపోవువారు కారు. జన్మమంతయు యుద్ధములయందె గడపి దేశ సంరక్షణము నిమిత్తము రక్తము ధారపోసి యుద్ధములలో నొకకన్ను నొకచేయ యొకకాలు పోగొట్టుకొని యెనుబది గాయముల చేత తూట్లుపడియున్న శరీరము గలిగి శూరశిఖామణి యను పేరు గాంచిన సంగుఁ డొకప్రక్క నుండెను. పెద్దపులిమీసములు మెలి పెట్టుటకైన సింగపుజూలు నూడబెరుకుటకైన వెనుకదీయని వారును గయ్యముల యందు మడమ దిరుగనివారును బ్రతికియుండిన మహాకీతి౯ని మృతి నొందిన వీరస్వర్గమును జూరగొనుటకు సిద్ధముగ నున్నవారు నగు రాజపుత్ర వీరులనేకు లామహా రాజు వెనుక బాసటయై నిలిచిరి. వా