పుట:Raajasthaana-Kathaavali.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

రాజస్థానకథావళి,


బందుగుఁడు గూడనచ్చి పిలుచుట సంభవించెను. అందుచేత బేబరు దిట్టమయిన సేనం గూర్చుకొని పర్వతములలో నుండి బయటఁబడి పంజాబు దేశమును గడచి తన్నెదిరింపవచ్చిన సేనల నొకదాని వెనుక నొకటి జయించి క్రమక్రమమున ఢిల్లీ మీఁదికి వచ్చెను. అట్లు వచ్చివచ్చి పానిపట్టు గ్రామమున లక్ష సైన్యముతో యుద్ధమునకు సిద్ధముగానున్న ఢిల్లీ యిబ్రహీంలోడీని గాంచెను. ఇబ్రహీం రణరంగమున మృతినొంది చక్రవతి౯ యని యానవాలు పట్టుటకు వీలులేని స్థితిలో పడియుండెను. బేబరు చక్రవతి౯ యగుటచే మసీదులో ప్రాథ౯నలతని పేరనే జరిగెను.

మహా సేనాసమేతుఁడగు ఢిల్లీ చక్రవతి౯ కాబూలు ప్రభువగు చిన్నదొర చేత నోడింపఁబడుట హిందువులకు సంతోషకరముగాదయ్యె. ఏలయన నిద్దఱు గొడ్డు మాంసముఁదిను పచ్చి తురకలె. ఇద్దఱు హిందువుల దేవాలయముల నాశనముచేయు ఘాతుకులే. వారిరువురిలో నెవరు గెల్చిన వానిని దరిమికొట్టు భారము రణసింహుఁ డగు మీవారు రాణా దని జనులు చెప్పుకొనిరి.

అందుచేత రణమల్లుడును తేజోరాశియు నగు సంగమహారాజు బేబరు పైఁ గత్తికట్టి కయ్యమునకు వెడలెను. ఆ రాజసింహునకు సాయమై యెనుబది వేలగుఱ్ఱపుదళము, నుత్తమవంశజులగు నేడుగురు మహారాజులు, రావు బిరుదముగల తొమ్మండుగురు సామంతులు, రావలులు రాహూత్తులను బిరుదులుగల నాయకులు నూటబదునలుగురు నడుచుచున్న కొండలవంటి యేనుఁగు లైదువందలును వచ్చి సంగర రంగమున నిలిచె, ఈ సేనం గూర్చుకొని సంగుఁడు మొట్టమొదట బయానా యనునూరికి బోయి యచ్చటి కోటను ముట్టడించెను. ఆ ముట్టడి జరుగుచున్న కాలమున నే సంగుఁ డొక నాఁ డచ్చటి పసుపునీటి యేటిలో స్నానము సేయుచుండ గంఠమునందలి రక్ష రేఖ వెనుక పక్కకుం దిరిగి వీపుపై వ్రేలఁ బడియె. అప్పుడు దన మరణ మాసన్నమైనదని యతఁడు దెలిసికొని తగుప్రయత్నముఁ జేయునప్పటి కంత