పుట:Raajasthaana-Kathaavali.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాసంగుఁడు.

81


షుని పేర తనయూర నొక యాలయము గట్టించేను. ఆయాలయము సంగుడు పోయిన వెనుక చాలకాలమువఱ కుండెను.

దివ్యపురుషు: డిచ్చిన రక్ష రేఖ రాజపుత్రులమీఁదను మహమ్మదీయులమీఁదను పలుమారు ప్రయోగింపఁబడి యజమానునకు జయముక లిగించుచు వచ్చెను: 'కాని స్వల్పకాలములోనే మహావీరాధి వీరుఁడై మేజిమగల గండడగించి శూర మండలమును గడగడ వడకించిన రాజసింహమునకుఁ దనకు వెరపు గలిగింపఁగల సాహసుఁ డొకఁడు బయలు దేరుచున్నాఁ డన సంగు డించుకయు నెఱఁగఁడయ్యె. అప్పుడు సుల్తాను యిబ్రాహీ మనునతఁడు ఢిల్లీ చక్రవతి౯గా నుండెను. వాని క్రూరత్వము దౌర్జన్యము గర్వము మితిమీరియుడుటచే మంత్రి సొమంతాదులు వానితో వేగలేక వానిని విడిచిపోయిరి. దేశమందంతట పితూరీలు బయలుదేరెను. చక్రవతి౯ యొక దానిని క్రౌర్యముతో నడప మఱియొకటి తలయెత్తుచుండెను. ఇట్లుండ చక్రవతి౯ పినతండ్రి ఢిల్లీ మీఁదదండెత్తుమని బేబరును ప్రేరేపించుటకు కాబూలు నగరమునకుఁ బోయెను.

ఈబేబరు 'మొగలాయివంశస్థుఁడగు మహమ్మదీయుఁడు. ఈతని పూర్వులు చంగిసుఖాను టామరులేను మొదలగువా రింతకుమున్ను హిందూస్థానముపై దండెత్తి తురకల కందఱకు దారి చూపిరి. బేబరు చిరకాలము నుండి హిందూదేశముపై నెపుడు దండెత్తుదునాయని యూటలూరుచు మంచి యదనునకై వెదకుచుండెను. ఆదివఱ కతఁ డొకసారి పాంచాల దేశఘు పై దండెత్తెను. ఆదండయాత్రలో నతనికి రాజ్యలాభ మంతగా లేక పోయినను వాని సైనికులు పర్వతనమయమగు తమ గొడ్డు దేశముల నెన్న డెఱుఁగని మహాభోగముల రత్నగర్భ మగు హిందూదేశమున ననుభవించుటఁ జేసి యీ దేశమును వదలి పోఁజాలక దండెత్తుమని తమ యజమానుని బురికొల్పిలి. యజమానుని యొక్కయు సైనికుల యొక్కయు కోరికలకనుగుణముగా ఢిల్లీ చక్రవతి౯