పుట:Raajasthaana-Kathaavali.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

రాజస్థానకధావళి.


వారు తక్కఁ దక్కిన మ్లేచ్ఛులు హతులైరి. తారాదేవియొక్క మనోరథము సంపూర్ణముగ సఫలమయ్యే. తోడానగర మామెతండ్రి స్వాధీనమాయె. సాటి తురక రాజునకు జరిగిన పరాభవమును విని యజమీరును బాలించుచున్న మ్లేచ్ఛప్రభువు పృధివిరాజును దండింప వలయునని నిశ్చయించుకొనెను. ఆవాత౯ విని పృథివిరాజు వాఁడు తనమీఁదికివచ్చువఱకుఁ గని పెట్టుకొని యుఁడక తానే వానిమీఁదికి ముందుగ యుద్దమునకు సిద్ధమయి సైన్యముం గూర్చుకొని తనజాడ వారెఱుంగకుండ నడిరేయి పయనముఁ జేసి యుదయ మగునప్పటి కాయూరుఁ జేరి వారిదళంబుల నోడించి కోట నొక్క పూఁటలోఁ బట్టుకొనియె.

రాయమల్లుఁడు తనకుమారుని మహాసాహసములు విని యానందభరితుఁడై వానిం దనసన్నిధికి రమ్మని వర్తమాన మంపె. జయమల్లుఁడు కులమునకు పరాభవము దెచ్చి దుర్మరణము నొందుటయు సంగునిజాడ యొక్కింతయుఁ దెలియ రాకుండటయుఁ దలంచి రాయమల్లుఁడు పృథివిరా జోక్కఁడే తనకుం గొడు కని యెంచి చిత్తూరునకు రావించి వానిని సబహుమానముగా నాదరించె. పృథివి రాజును తండ్రికి విధేయుఁడై యుఁడఁదలంచెను, కాని వానికిఁ జిత్తూరునగరమున శూరకర్మలుమానీ సోమరియై భోగపరాయనణుఁడై యుండుట కిష్టము లేకపోవుటచే తనయిచ్చవచ్చిన తెఱంగున వీర విహారము సలుపుటకు మీవారు దేశమున పడమ భాగమున నున్న కమల్ మియర్ గోటలోఁ గాఁవురము చేయఁదలంచి యచ్చటికిఁ బోయెను. ఆకోట యిప్పుడు మిక్కిలి పాడుపడియున్నను మిగిలిన భాగములం జూచువారికి దాని తొంటి గొప్పతనము తెలియక పోదు. దృఢమయిన రాతిగోడలు మహోన్నతము లయినగోపురములు గురుజులు మంచిమంచి మేడలు గలిగి యాకాలమున నది నకల సౌఖ్యనిధానమై శత్రుదుర్భేద్య మయి యుండెను. పృథివిరా జందు భార్యాసమేతుండై వసియించి దుష్టుల