పుట:Raajasthaana-Kathaavali.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు.

63


వివాహము చేసెను. వధూవరు లిరువురును తోడా పట్టణమును బట్టు కొనుటకు సమయము వెదకుచుండిరి. అంతలో తురకల మొహరము పండుగ వచ్చేను.

తుఱక రాజు వాని సైనికులు చుట్టములు నానందపరవశులై యుత్సవములం జూచుచుండిరి. పండుగ కడపటిదినము నీళ్ళంబడిన వెనుక పీరులను శవాకారముగఁగట్టి తుగకలు నాలుగు వీధుల మొగ లో బెట్టి వారియాచారప్రకారము దుఃఖించు చుండిరి. జను లనేకులు గుంపులుగూడి యావినోదమును జూచుచుండిరి. అప్పుడు గంభీరాకారములును చిత్ర వేషములుం గలిగిన మువ్వురు మనుష్యు లాగుంపులో గానఁబడిరి. తురకరాజు తన మేడ మీఁద నుండి యాయుత్సవమును జూచుచు క్రొత్త మనుష్యుల పై దృష్టి నిలిపి వారెవ్వరని ప్రక్కవారి నడిగెను. ఆమాటలు వానినోటనుండి కడదేర రాకమునుపే రివ్వురివ్వున యొక బాణ మాగుంపులో నుండి వెడలి నిలుచున్న యారాజును గుభాలున నేలంబడ వైచి శవముగఁ జేసెను. అంతట నగరమంతయుఁ గళవళము పుట్టెను, ఉత్సవముఁ జూడవచ్చిన వారు నిర్విణ్ణులై పరుగెత్తిరి. మ్లేచ్చ సైనికులు యదాయద లైరి. ఆకోత్త మనుష్యులు మువ్వురు పృథివి రాజు తారా దేవి వారి సేవకుఁడు దక్క మరొకరు గారు. వారు వచ్చిన పని నిర్వతి౯ంపఁబడినది గదాయని యూరుబైటకుం బోవుచుండిరి. అప్పుడు కొందఱు మ్లేచ్ఛ సైనికులు 'ధైర్యము దెచ్చుకొని వారిని దఱుమ నారంభించిరి. ఆమువ్వురు వారిని లెక్క సేయక చనుచుండ' నగర ద్వారమువద్ద కొండవంటి యొక యేనుఁగు వారికడ్డము వచ్చె తోడనే తారా దేవి యొరలోనుండి ఖడ్గము నూడ బెరికి ఝళిపించి తోండమును నఱికి యేనుఁగును పీనుఁగును గావించె.

అనంతర మామువ్వురు నూరుబైట సిద్ధముగానున్న తమ సైన్యముం గలసికొని యనాయకమై యరాజకమైన మేచ్ఛ సైన్యము పయింబడి దానిం జెల్లా చెదరుగా జేసిరి. కాలి కొలఁది పరుగెత్తిన