పుట:Raajasthaana-Kathaavali.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా కుంభుఁడు.

53


గులకు మొక్కి తన జేబులోనున్న యమూల్యమగు రత్న హారముఁ దీసి యామె కిచ్చెను. ఇది యెక్కడిదని యామె యడుగ నతఁడు స్నానము చేయుచుండ నాకిది యమునానదిలో దొరకిన దని చెప్పి యవ్వలకుం బోయెను. ఆ దేవియు నతఁడు చక్రవతి౯యని ,యెఱుఁ గక నిజముగ గోసాయి యనుకొని యాహారము స్వామి కర్పించెను. . రాణాకుంభుఁ డాహారమును జూచి యది చక్రవతి౯ వద్దనేగాని గోసాయీలవద్ద నుండునది గాదని నమ్మి రత్నాలవత౯కులకుఁ జూప వారు దానిం బరీక్షించి యది ఢిల్లీ చక్రవతి౯దని యానవాలుపట్టి చెప్పిరి. కుంభుఁడు భార్యపై ననుమానపడి భార్యం జంపుమని మం త్రుల కౌనతిచ్చె. ఆమె మహాపతివ్రత యని యెఱుఁగుటచే నామె నెవ్వరుఁ జంపరైరి. అనంతరము భత౯ కిష్టము లేనప్పుడు తాను బ్ర తుకఁ గూడ దని నిశ్చయించుకొని యాదేవి యర్ధరాత్రమున నెవ్వరికిఁ దెలియకుండ కోట వదలి యావలకుంబోయి యొక నదిలోఁబడెను. అప్పుడు భగవంతుఁడు కృష్ణుఁ డే వచ్చి యామెను జావకుండఁ గాపాడెనఁట ! పిదప నామె బృందావనమున కరిగి భక్తురాలై తన జీవిత శేషము నచ్చటనే గడపెను. ఉత్తరహిందూస్థానమున మీరాభాయి చేసిన కృతులు నాబాలగోపాలముగ నిప్పటికిని బాడుచు నామె పేరు శిరసావహింతురు.

అనంతరము కుంభుని చుట్టములగు మార్వారు రాజకుమారులలో నొకనికి జాల్వారు దేశపు రాజుకూఁతు నిచ్చి వివాహము చేయుటకుఁ పెద్దలు నిశ్చయించిరి. కుంభుఁ డావాత౯విని |యాకన్యను తానే పెండ్లి చేసికొనఁగోరి ప్రాఁత చుట్టరిక మయినను దలంపక యపకీతి౯కి జంకక యాకన్యను బలాత్కారముగా నెత్తుకొనివచ్చియామె కిష్టము లేకున్నను వివాహము చేసికొనెను. ఈయవివేక కార్యమతని ననేక కష్టములపాలు చేసెను. అదివఱకుఁ గొంతకాలము నుండి గలిసియున్న మీవారు మార్వారు రాజకుటుంబములకు మరల బ్రబల వైరము