పుట:Raajasthaana-Kathaavali.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

రాజస్థానకధావళి.


గలిగెను. కొత్త పెండ్లాము మనసున మగని పై నిష్టము లేదు.

ఆమె మొదట మార్వారు రాజకుమారుని వలచుటచే నెల్లప్పుడు నతనినే ధ్యానించుచు చిత్తూరునకు వచ్చి తనను దీసికొని పొమ్మని వానికి సందేశముల నంపుచు తనహృదయమున మదనానల మిట్లే మండుచున్న దని తెలియఁ జేయుటకుఁ దనమేడ పై నొక పెద్దదీప మును 'రాత్రులు పెట్టించుచు వచ్చెను. మివారు రాజకుమారుఁడు నామెయందే వలవు నిలుపుటచే నామెకొఱకే పరితపించుచు నొక మారు చిత్తూరుసకుఁ బోయి కోటలోఁ బ్రవేశించి యామెను దీసి కొనిపోవుటకు యత్నించెనుగాని యాతనియత్నము కొనసాగదయ్యె.

కుంభుఁడు కొలువునకు వచ్చినపుడెల్ల ముందుగాఁ దనచేతికత్తి ముమ్మారు తన చుట్టు త్రిప్పుకొని యేరికి వినఁబడకుండ కొన్ని మాటలు తనలోఁ దాను గొణుఁగుకొనిపిమ్మట గూర్చుండును. ఇదియంతకుమున్ను చాలకాలమునుండి వానికి యభ్యాసము. కుంభుని జ్యేష్ఠపుత్రుఁడును యువరాజు నగురాయమల్లుఁడు తనతండ్రి చేయునట్టి యాపని కేమియర్ధమో తెలియక తన సందియము తనలోఁ సణఁచుకొనఁజాలక సందేహనివృత్తిఁ జేసికొనఁదలఁచి దాని యర్ధమే మని తండ్రి నడిగెను. తండ్రి దానికి యథ౯మును జెప్ప లేదు సరిగదా మీఁదుమిక్కిలితన దేశము నుండి తత్ప్రణమె వెడలిపొమ్మని కొడుకున కాజ్ఞాపించెను. రా రాయమల్లుఁడు విదేశములం దిరుగుచుండ రాణా చిన్న కొడుకులలో నొకఁ డొక చారునకు లంచమిచ్చి వానిచేఁ దండ్రిని జంపించి తన యన్న గారి కావాత౯ దెలియక మునుపే తానే గద్దెయెక్కెను. ఆపి తృద్రోహి తన పదవి స్థిరముగాఁ జేసికొనుటకు జుట్టుప్రక్కల రాజులకు లంచము లిచ్చి వారిమైతిఁ గావించి యెట్టెటో దేశము నైదేండ్లు పాలించె, అంతలో రాయమల్లుఁడు మహాసేనఁ గూర్చుకొని తమ్మునిపై నెత్తివచ్చి వాని నొడిసిపుచ్చి పారఁదోలి తాను సింహాసన మెక్కెను. తండ్రిం గడ తేర్చిన శూర శిఖామణి స్వరాష్ట్రమున