పుట:Raajasthaana-Kathaavali.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

రాజస్థానకథావళి.


మీరాభాయి హిందీ భాషలో ననేక పద్యములు కృతులు భగవత్పరముగాఁ జెప్పెను. చెప్పుటతోఁ దనివిసనక చిత్తూరునం దొక కృష్ణాలయమును గట్టించి యచ్చటి కనుదినమును బోయి తాను జెప్పిన కృతులు పద్యములు చదివి స్వామిని స్తుతియించి తాను మహారాజ పట్టపు దేవి ననుమాట మఱచి సామాన్య స్త్రీవలె భగవంతుని యెదుట నాడి పాడివచ్చినవా రందఱి కన్నులను వీనులకు విందు సేయుచుండును. సహజముగఁ గంఠ మాధుర్యముగల స్త్రీ సంగీత శాస్త్రమునందసమాన ప్రజ్ఞ గలదై భక్తిరస ముట్టిపడునట్టు పాడునపుడు విను వారి మనస్సులు కఱగి నీరై పోవా ? అందు చేత మీరాభాయిపాట విన్నవారందఱు గృష్ణునియందుఁ బరమభక్తులైరి. ఆమె జగమంతయు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపమేయని సంసారపుగొడవలు వదలుకొని స్వామిగుణముల వర్ణించి కవనము చెప్పుటయు పాడుటయు నాడు

టయుఁ దక్క తక్కిన పనులజోలికిఁ బోదయ్యె. పురజను లామె గానమును వినుటకుఁ బ్రతిదినము 'వేనవేలు కృష్ణాలయమునకుఁ బోవుచు వచ్చిరి. ఆమెకీతి౯క్రమక్రమంబుగ నుత్తర హిందూస్థానమంతయు వ్యాపించుటం జేసి దూర దేశమునుండియు ననేక జనులు వచ్చి యామె గానమును విని భక్తికి సంతోషించి పోవుచుపచ్చిరి. ఆనాటి ఢిల్లీ చక్రవతి౯ యామె యసమాన ప్రజ్ఞలను విని తన చెవులు ధన్యము లుగఁ జేసికోనవలయు నని నిశ్చయించుకొని మహారాజు పట్టవు దేవి కరకుతురక యెదుట నిలిచి పొడదనుకొని గోసాయివేషము వేసికొని యొక్క సేవకునితో బయలు దేరి చిత్తూరునకు వచ్చి సాయంకాలమున హిందువులతోఁ గలిసి కృష్ణాలయముఁ బ్రవేశించెను,

ప్రవేశించి జగన్మోహనమగు నామెరూపమును మనసును కరగించు పాటయుఁ గని విని ఢిల్లీశ్వరుఁడు పరవశుడయి యామెయడు