పుట:Raajasthaana-Kathaavali.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

రాజస్థానకధావళీ,


ఆకాలమున ఢిల్లీ రాజ్యము పూర్వవైభవము నంతను బాసినామావశిష్టమై యుండెను, తొల్లి చక్రవర్తులకు లోఁబడిన రాజ్యము లన్నియుఁ గ్రమక్రమంబున ఢిల్లీకిఁ గప్పము చెల్లించుట మాని స్వతంత్రము లయ్యె. ఈ విధముగా స్వాతంత్య్రముఁ బడిసిన రాజ్యము లలో మాళవదేశ మోకటి. అది పూర్వము హిందూ రాజుల పాలనము నుండియు నాసమయంబున మహమ్మ దను పేరు గలయొక మహావీరుని పాలనంబున నుండెను. అతఁడు మహాబలదర్పితుండై ఢిల్లీపైఁ దిరస్కార భావముఁ జూపుటయేగాక యనేక దేశముల జయించి చిట్టచివరకు రాజస్థానముమీఁద దండెత్తుటకు యత్నించెను. కుంభుఁ డాసచాచారము ముందుగానే విని లక్ష గుఱ్ఱముల దళమును పదునాలుగువందల యేనుఁగులను గూర్చుకొని మహా సేనతో మాళవ దేశముపై దండు విడిసె. అప్పుడు కుంభునకును మహమ్మదునకును దారుణ యుద్ధము జరిగెను. దైవానుగ్రహము చే నాకయ్యమునందు మహమ్మదీయులకు సంపూర్ణ పరాజయమును హిందువులకు పరిపూర్ణజయం బును గలుగుటయేగాక మాళవ దేశాధిపతి యగుమహమ్మదు కుంభునిచేఁ జిక్కి చిత్తూరునకు ఖైదీగాఁ దీసికొనిపోఁబడెను. అచ్చట నతఁ డాఱుమాసములు చెరలో నున్న పిదప కుంభుఁడు వానిం గరుణించి వానివద్దనుంచి ధనమునుగాని కానుకలుగాని రాజ్యమునుగాని గ్రహిం పకయే తానే వానికనేక బహుమానము లిచ్చి వానిని విడిచిపుచ్చెను. మహమ్మదు తన కిరీటమునుమాత్రము చిత్తూరుకోటలో విడిచి పోయేను. మహారాణాకుంభుఁడు తన యెడలఁ జూపిన నిర్హేతుక కృపారసమును దలఁచి మహమ్మదు వానియెడజాల కృతజ్ఞుఁ డై వానితో గలసి సాటి తుఱక యగుఢిల్లీ చక్రవ ర్తిమీఁదికి యుద్ధమునకుఁబోయి యిరువురుం గలసి మరల దల యెత్తకుండ వానిని నోడించిరి.

మాళవ దేశాధిపతి గర్వమడంచిన పిదప కుంభుఁడు తన విజయ మా చంద్ర తారార్కముగ భూమిలో నిలుచునట్లు చిత్తూరునం దొక