పుట:Raajasthaana-Kathaavali.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా కుంభుఁడు.

51


జయ స్తంభమును గట్టించెను, అది చిత్తూరురాజ్యలక్మి యొక్క తొంటి వైభవమును తెలియఁ జేయుచు నిప్పటికీ నిలిచియున్నది. దానిం జూడనివారు దాని గొప్పతన మూహింపఁ జాలరు. చూచిన వారు వర్ణింపఁజాలరు, అది కట్టుటకే పదిసంవత్సరములు పట్టెసు. దాని పొడవు నూట యిరువది రెండడుగులు. అది నలుదెసలకు నాలుగుపలకలు గలిగి యున్నది. దానికి తొమ్మిది యంతస్థులు గలవు. ప్రతి యంతస్థునం దొక్కోక్క నల్ల రాతి పలక మీఁదఁ జిత్తూరు రాజవంశి చరిత్రము వ్రాయఁబడియున్నది. అంతియగాక దేవతలయు రాక్షసు లయు నప్సరస స్త్రీలయు వీర పురుషులయు విగ్రహములు చిత్రచిత్రములుగ విన్నాణ మేర్పడ చెక్కఁబడియున్నవి. దానిసొగ సంతయు నిచట వర్ణించుటకు వీలుగాదు.

ఈజయ స్తంభము నే గాక యమ్మహావీరుఁడు చిత్తూరునగరము సందు శ్రీకృష్ణునకును బ్రహ్మకును వేరు వేరుగ నాలయములును ఆరా వళీ పర్వతములయందలి యాబూశిఖరముమీఁద మఱియొక కోవెలను గట్టించెను.

అతఁడు మిక్కిలి దేవతాభ క్తుఁ డేగాని తన రాజ్య సంరక్షణమునకుఁ గేవలము దేవతలనే నమ్మియుండక మనుష్య ప్రయత్నముగూడ నమ్మి పాతకోటలను బాగు చేయించి క్రోత్తకోటలఁ గొన్ని కట్టించి దేశము శత్రుదుర్ని రీక్ష్యముగఁ జేసెను. ఈకోటలో గుంభల్ మియర్ ' అనునది ముఖ్యమైనది. కుంభల్' మీయర్" అనగా గుంభునికొండ యని యర్ధము, ఈకొండకోటలోఁ గూరుచుండియే కుంభ మహారాజు తన యిష్ట దైవమగు శ్రీకృష్ణునిమీఁద బద్యములు కృతులు చెప్పుచు వచ్చెను. మహారాణా కుంభుఁడును వాని పట్టపుదేవి యగు మీరాభాయియు హిందీ భాషలో మిగుల లలితమగు కవిత్వము జెప్పగల ప్రోడలు, సత్కులప్రసూనత చక్కఁదనము సత్ప్రవత౯నముగల రాజపత్ను లనేకు లుందురు; కాని సాహిత్యము సంగీతము దైవభక్తి గలవా రుండుట యరిది.