పుట:Raajasthaana-Kathaavali.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా కుంభుఁడు

49


మీఁద నడచు చుండిరి .కొంతద వ్వరిగి సుజా యెత్తగు నొక రాతిపై నడుగు పెట్టఁబోవుచుండఁ జింతనిప్పులవంటి గుడ్లు గలిగి యెరకోఱకై చూచుచున్న యొక యాడు పులి గానఁ బడియె. అచ్చమగు తనకులంబునకు మచ్చ గలిగెనని మనంబున మిక్కిలి పరితపించుటచే యాసుజా పులియైనను సరే భూతమైనను సరే బ్రతికినను సరే చచ్చినను సరే భయము పడక వెనుకంజ యిడక యచ్చటనే నిలువఁబడి మాటలాడ వలను పడమి యపాయమును సూచించుటకై రాజకుమారునిహస్తము స్పృశించెను. 'రాజనందనుఁ డాసన్న యెఱిఁగి యపాయ మాసన్న మయ్యెనని నలు దెసలు పరికించి నెత్తురుముద్దలనంటి కన్నులు గలిగి తమపై నుంకించి దుముకఁబోవుచున్న బెబ్బులిం గాంచి కత్తిదూసి పొడిచి యొక్క యేటున దాని నంత మొందించె. ఆ దెబ్బతో నది కొండ పై నుండి దొర్లి క్రిందపడియె. కాచునికూఁతు రప్పుడే 'మెలఁకువ నొంది యేదో చప్పు డగుచున్న దని తండ్రిని లేపి శత్రువు లేమో చూడు నాయనాయని పలికెను. ఆపలుకులు విని కాచుఁడు భయము లేదు. పండుకొనుము. మనశత్రువులు చాలదూరమున నున్నారు. అది యురుములచప్పుడుగాని మఱియొకటిగాదు. దైవమును దలఁచు కొనుచు నిర్భయముగా నిద్రింపుమని తానును గుఱ్ఱుపట్టి నిద్రించె.

అంతటఁ గొంత సేపటికి శత్రువులు గోటలోఁ బ్రవేశించినారని యందఱకు స్పష్టముగాఁ దెలి సెను. కోటలోని సైనికు లందఱు చప్పుచప్పున నాయుధములకొఱకై పరుగు లెత్తిరి. కాని వారిశ్రమ యంతయు వృథ యయ్యె. మార్వారు రాజకుమారుఁడు మేరుని గడ తేర్చె. సుజా కాచుని దెగటార్చి తనయక్కసు దీర్చుకొనియె. ఇవ్విధంబున నొక్క ముహూర్తమందే రాజద్రోహంబును స్త్రీమానద్రోహంబును జేసినదురాత్ములు తమదోసంబులకు దగినశిక్షలం బొందిరి. ఇట్లు తండ్రిం జంపిన దురాత్ముల నంత మొందించి కుంభుండు సింహా సనమున సుప్రతిష్ఠుఁడై నేలం బాలింస నారంభించెసు,