పుట:Raajasthaana-Kathaavali.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

రాజస్థానకథావళి,


బెట్టించేను. వారందఱు మిక్కిలియాఁకలిగొని యుండుటచే నది యేదో కొత్త పిండివంట యనుకొని తమకముతో భక్షించిరి. ఆ మొక్కలు రంగు వేయుటకుఁ దరుచుగ నుపయోగింపబడుటచే భోజనాంతరమున నతిథుల గడ్డములు మీసములు కొంచె మెఱ్ఱఁబడియుండుటచే వా రొండొరులు మొగంబులు జూచుకొన నారంభించిరి. అప్పుడు శంకరుఁడు వారియొద్దకుఁ బోయి తనపై వారికనుమానము కలుగకుండు నట్లు వారితో నిట్లనియె. "చూచితిరా యీశ్వరమాయ? మీకష్టకాల మిట్లే మారిపోయి సుఖకాల మగునని తెలియఁ జేయుటకు భగవంతుఁడు మీమీసముల కీమార్పు కలుగఁ జేసెను” అని యతండు చెప్ప వానియందలి భక్తిచే వారామాటలు నమ్మి యటనుండిపోయి సమయము వచ్చువఱకు మండూరు చుట్టుపట్ల నడవులలోఁ దిరుగుచుండిరి. అంతట ముకుళుఁడు యుక్తవయస్కుడై రాజ్యభారము వహించెను. చండుఁడును వానికొడుకులును మండూరు రాణాకు బదులుగ నేలుచుండిరి. రాణీ హంసాదేవి తనకుమారుఁడు రాజ్యభారముఁ బూని నిరపాయస్థితి నున్నందున దిక్కుమాలిన యడవులం దిరుగుచున్న తనసోదరున కేదేని యుపకారముఁ జేయ నిశ్చయించుకోని వాని రాజ్యము వానికిమ్మని కొడుకును బ్రతిమాలుకొనెను. ముకుళుఁడు సరే యని చండునితో నాలోచించుటకు వానిం దనవద్దకు రమ్మని వత౯మాన, మంపె. ఇరువురుకొడుకులను సపరివారముగ మండూరినం దుంచి చండుఁడు పెద్దకుమారుఁడగు ముంజునితో గలిసి రాణావద్దకుఁ బయనమై పోయెను.

వాని పయనముమాట చారులవల్ల నెఱిఁగి జోడా హర్బశంకరుఁడు మొదలగుకొందఱుజోదులం గూర్చుకొని మండూరునకుఁ బోయి చండుని కొడుకుల వధించి పట్టణ మాక్రమించెను. చండుఁడు మార్గ మధ్యమున నామాట విని కోటఁ గాపాడుమని ముంజుని వెనుకకంపె; కాని సపరివారముగ సోదరు లదివఱకె మృతినొందుటం జేసి తా