పుట:Raajasthaana-Kathaavali.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండుని కథ.

43


రణమల్లు యొక్క పెద్దకుమారుఁడు జోడా' యను నతఁడు తక్క తక్కిన మార్వారు దేశస్థు లందఱు హతులైరి. జోడా 120 మంది బంట్లతో చండుని బారింబడక తప్పించుకొని ప్రాణములు దక్కించుకొని తన స్వస్థానమును మార్వారు దేశమునకు రాజధానియునగు మండూరుపట్ట ణమునకు పయనమై పోయెను.చండశాసనుఁ డగు చండుడు వెన్నంటి తరుముటచే నచ్చట నిలువలేక యతఁడు హర్బశంకరుఁ డను నొక మిత్రునియింటికి పారిపోయెను. విజయుఁ డగు చండుఁడు మీవారు దేశమును, గొత్తగా నాక్రమించిన మార్వారు దేశమును తమ్ముని పేర బాలించు చుండెను.

ఈహర్బశంకరుఁడు మీవారు నూర్వారు సరిహద్దులో నున్న యొక యడవిలోఁ గాపురమున్న క్షత్రియుఁడు. అతఁడు పరమభక్తుఁడు, మహాశూరుఁడు, ఆపద్బాంధవుఁడు, శరణాగతరక్షకుడు. అడిగిన వారికి లేదనకుండ నిచ్చునటుల దానకంకణము గట్టుకొన్నవాఁడు. కాకులను గొట్టి గద్దలకు వేయున ట్లతఁ డప్పుడప్పుడు చుట్టుప్రక్కల గ్రామములు దోఁచుకొనివచ్చి బీదలకు బాహ్మణులకు సంతర్పణలు చేయుచుండును. తన చిన్న సేనతో జోడా హర్భశంకరుని యింటికిఁ బోయిన దినము పండుగ యగుటచే నచ్చట విశేషముగా నన్న ప్రదానము జరుగుచుండెను గనుక తమ కేవెలితియుఁ గలుగదని యతఁడనుకొనెను. కాని శంకరుఁడు వారు వచ్చునప్పటి కోక్క మెదుకైన మిగులకుండున ట్లన్నప్రదానము చేసెను. ఆకలి దప్పికలచేతను మాగా౯ యాసము చేతను బడిలి యాక్రోత్తగా వచ్చిన నూట యిరువది మంది యతిథులకు నేమి పెట్టుదును నాకీదిన మెట్లు పరువు దక్కునని శంకరుఁడు విచారించి యొక యుపాయము గని పెట్టెను. అప్పుడప్పుడు రంగులు వేయుటకును గఱువు కాలమున బీదలుదినుటకు నుపయోగించు నొక మోక్క యతని కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. ఆ చెట్లు తెప్పించి మెత్తగా నలగదంపించి పిండియు బెల్లమునుగలిపించి వండించి వారికిఁ