పుట:Raajasthaana-Kathaavali.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణా కుంభుఁడు.

45

నొంటిగ నేమియుఁ జేయలేక ముఁజుఁడు మరలివచ్చుచుండ జోడా వానిని వెన్నంటి తరిమి త్రోవలోఁ దెగటార్చి ప్రాఁతపగఁ దీర్చుకోనియె. చండుఁడు తనకుమారుల మరణవార్తవిని తాను మండూరు పట్టుకొని జోడాను సంహరించుటకు సమర్థుఁ డయ్యుఁ గయ్యమునకుఁ గాలుదువ్వక తనకొడుకులు రణరంగమున వీరపురుషోచితమైన మరణము నందినా రని సంతసించి జోడా తండ్రిని సోదరులను తాను మున్ను జంపినందుకుఁ దనకుమారుల నిప్పు డతఁడు వధించి యుండు నని సరిపెట్టుకొని రాజపుత్రు లొకరితో నొకరు పోరాడుట తగనిపనియని హితోపదేశము చేసి ముకుళునితో చెప్పి వానిరాజ్యము వానికిప్పించి మారువారు రాజ్యములోని యొక్క తాలూకామాత్రము చిత్తూరు రాజ్యమునఁ గలిపించి యెల్లల నేర్పఱచి తా నెప్పటియట్ల తమ్మునిం గొలిచి బ్రతుకుచుండెను.

నాఁడు మొదలు మేవారు రాజకుటుంబమును మారువారు రాజకుటుంబమును తమతమ ప్రాఁతపగలు మరచిపోయి వియ్యము నెయ్యము హెచ్చ సుఖమున జీవించు చుండిరి. తరువాతఁ జిత్తూరు నగరముపై నొకసారి శత్రువు లెవరో దండెత్తిరా జోడా తన సేనలం గూర్చుకొని మేనల్లునకు సాయమయ్యెను. చండునివంటి నీతిమంతులు దేశాభిమానులు ననేకులు మన దేశమునఁ బుట్టి మార్గప్రదర్శకు లయ్యెదరుగాక!


రాణా కుంభుఁడు.


రాణాముకుళుని దర్బారులో నున్న దొరలలోఁ గాఁచుడు మేరుఁడు ననునిరువురు సోదరు లుండిరి. వారు ముకుళుని తాతయగు ఖేటసింగునకుఁ గుమారు లగుటచే నతనికి సవతి పినతండ్రులైరి. కాచ