పుట:Raajasthaana-Kathaavali.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాహమీరు.

27


మారు వారు పోరాడుచు వచ్చిరి. అట్టివారిలో బ్రధానుండు మూంజ జాతీయుఁ డగు నొకశూరుఁడు, ఆమూంజుఁ డొకనాఁడు కెయిల్వారా మీఁదికి దండెత్తి వచ్చి రాణా నెదిరించి వానిని తలపై బల్లెముతో బొడిచెను.

అజేయసింగు గాయమున కంత లక్ష్యముఁ జేయలేదుగాని తీవ్రమైన యాపరాభవ కళంకమును మూంజుని నెత్తుటితోఁ గడిగి వేయవలయునని నిశ్చయించి తనకొడుకులం బిలిచి మీరు నా కపకారము చేసిన మూంజునిపైఁ జని పగఁ దీర్చుకొనఁగలరా యని యడుగ వారు వీర పురుషోతచిత మైనయుత్తర మొసంగ లేకపోయిరి. అప్పుడతడు హమీరునకుఁ దనకోర్కె నెఱిఁగింప నాకుమారసింహుఁడు పినతండ్రితో « నే నిదె పోవుచున్నాను నేను పగతుని జయింతునేని నన్ను మీకు వేగమే చూడఁగలగు.అపజయ మెందుదు నేని వారు నన్నిక నెన్నఁడు జూడ" రని ప్రతిజ్ఞఁ జేసి 'వెడలెను.

అనంతరము కొన్ని దినములకు కెయిల్వా రాజనులందఱు సంతసించునట్లు హమీరు విజయుఁ డై వచ్చి పినతండ్రికి నమస్కరించి “దేవర వారి శత్రునిశిర స్సిదిగో' యని మూంజునితల వానిపాదముల పైఁ బడవైచెను. అజేయసింగు సంతోషమున బాలునిగౌఁగిలించుకొని “నాయనా! నీవే మీవారు దేశమునకు రాజు వగుదువని నీ నొసటను వ్రాసి యున్నది.' అని మూంజుని నెత్తుటిలోఁ దన వ్రేలు ముంచి కుమారుని ఫాలమున నెత్తుటి బొట్టు పెట్టి తక్షణమే వాని యువ రాజుగఁ జేసెను.

అజేయుని కొడుకులవలన నించుకయు బాధ కలుగదయ్యె. ఏల యన నొకఁడు స్వల్ప కాలముననే మృతినొందెను. రెండవవాఁడు రాజ్య సంపాదనమునకై దేశాంతరముల కరిగి మరల రాఁడయ్యె. కొండలు నడవులు దప్ప మీవారు దేశమున మంచిభాగము లన్నియు నప్పుడు ఢిల్లీ చక్రవర్తిస్వాధీనమున నున్నందున మీవారు రాణాగా