పుట:Raajasthaana-Kathaavali.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

రాజస్థానకధావళీ,


నెవ్వరున్న నొకటియే యని యెంచి 'రెండవయతఁ డట్లు చేసె. తరువాత మూడువందల యేండ్లకు భాంస్టే కుటుంబయినఁ బుట్టి తురక రాజుల యేలుబడిచే సిలుగులఁ బడుచుండిన మహారాష్ట్ర దేశంబునకు స్వాత త్య్రము కలుగఁ జేసి తురక రాజులకుఁ బక్కలో బల్లెమై ఢిల్లీ పాదుషా యగు నౌరంగజీబునకు లోఁబడక వానిని బలుబాముల బెట్టిన దేశోపకారి యగు శివాజీ యీతనివంశస్థుఁ డే.

అజేయుని యనంతరమున హమీరు రాణా యయి ఢిల్లీ చక్రవతి౯: సైనికులతో క్రమక్రమమైన యుద్ధమును జేయుటకయి పూని తన్ను రాజుగా నంగీకరించీ తన రక్షణ మపేక్షించిన వారందఱు కుటుంబములతో వచ్చి కెయిల్పారాలో కాఁపుర ముండవలసిన దని యానతిచ్చెను. ఆట్లు వారువచ్చి చేరిన పిదప నా రాజకుమారుఁడు వారి సాయమునఁ జక్రవర్తికిలోఁబడియున్న భూములలో దండు విడిసి దారుల నరికట్టి మేచ్ఛసైనికులకు గర్భనిర్భేదకముగ విహరించెను. అప్పుడు రాణాహమీరు పేరు సింహస్వప్నమువలె నుండుటచే తురక సైనికులు వాని యెదుటఁ బడలేక గోలో డాఁగిరి. అతని నొక వేళ తఱుముకొని పోదలంచినను కొండదారుల నతఁ డెఱిగినట్లుత్రువు లెఱుఁగక పోవుటచేతను చుట్టు పట్ల ప్రజలందఱు వానియం దిష్టముగ నుండుట చేతను వైరుల ప్రయత్నములు నిష్ఫలము లయ్యె.

ఇట్లతఁడు వీరవిహారంబు సలుపుచుండ చక్రవతి౯ చేఁ జిత్తూరు పాలించుటకు నియమింపబడిన మాల దేవు తనకుమాతె౯ను హమీరున కిచ్చి వివాహము చేయుటకయి వానిని రమ్మని వత౯ మాన మంపెను. అతని యనుచరు లేదో ద్రోహము జరుగునని పోవలదని బ్రాధి౯చిరి; కాని హమీరు వారి పలుకులు విని నవ్వి 'సాహసలక్ష్మీ' యనుమాట నెఱుఁగరా? ఎట్లయినఁ జిత్తూరు మరలఁబట్టుకోనవలయు; నగర 'మేస్థితిలో నున్నదో తెలిసికొనుట కిదియే మంచిసమయము కాన పోవక మాననని కొందఱుమిత్రులు గలిసి యశ్వారూఢుఁడయి