పుట:Raajasthaana-Kathaavali.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

రాజస్థానకధావళీ.


వారిరువురకుఁ గలిగినకొడుకే హమీరుసింగు.

చిత్తూరుపురరక్షణమునకు హరసింగు ప్రాణత్యాగము చేసిన నాటికి హమీరు మిక్కిలి బాలుఁడు. అజేయసింగును చిత్తూరుకోట నుండి దాటించి యావలకుఁ బంపునపుడు మీవారు రాజ్యమునకుఁ దన ముద్దులమనుమఁ డైన హమీరును యువరాజుగఁ జేసి సింహాసన మెక్కింపు మని లక్ష్మణసింగు కడసారపు కోరికగ నజేయసింగును గోరెను. హమీరు తగి యున్నయెడల నట్లు చేయుదునని యజేయసింగు వాగ్దానముఁ జేసెను. అల్లాయుద్దీనునకు వెరచి చిత్తూరు నందలి స్త్రీలందఱుఁ జిచ్చురికి పురుషులందఱు శౌర్యము మెరయ యుద్ధము చేసి మృతి నొందిన యాదుర్దినమున హతశేషులై కొందఱు జను లజేయసింగుతోఁ గలిసి పారిపోయి కొండలలో కేయిల్వారలో దాఁగి యుండిరి. అల్లాయుద్దీను "దేశమంతయు దోచుకొని నాశనము చేయుచున్నను వీరుమాత్రము వానికి దొరకక సురక్షితులై యుండిరి. పద్మినీదేవి వసియించు మందిరము తప్ప చిత్తూరులో తక్కిన మేడల మిద్దె లన్నిఁటి నల్లాయుద్దీను పాడుచేసి తాను పోవునపుడానగరమునకు మార్టేవను హిందువును పాలకుఁడుగా నేర్పఱచి మివారు దేశము నందలి యనేక పట్టణములనుగూడ నాశనముఁ జేసి మరల ఢిల్లీకిఁ జనియెను.

కెయిల్వారాలో హమీరు తన పినతండ్రికుమారులతోఁ గలిసి విలువిద్య నేర్చుకొను చుండెను విలువిద్య కఱచుట కట్టియడవులే కదా తగిన చోటులు, ఆకుమారులు మువ్వు రచిరకాలములోనే పగతు దాకుటకు యెట్లో పొంచి వైరిం బడగొట్టుట యెట్లో పఱచుచున్న పగవానిని సిలుగులు బెట్టుట యెట్లో నేర్చిరి. ఆలాయుద్దీను దేశము నందుంచి పోయిన సైనికులతోడను రాజ్యవిహీనుఁడై యడవుల జరియించు రాణాకు లొంగుట కిష్టము లేక స్వేచ్ఛగాఁ దిరుగు కొండ దొరలతోడను దోపుడు కాండ్రతోడను దుర్మార్గులతోడను పలు