పుట:Raajasthaana-Kathaavali.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

రాజస్థానకధావళి,


అందఱు నన్ను బాసి పోవఁ దలఁచుకొన్నను నీవైన నాకడఁ గొంత తడ వుండి నాకూరట గలుగఁజేయు మని దీనముగ వేడుకొనఁ గుమారుఁ డట్లు చేయుట కిష్టము లేక యుఁ దండ్రిమాటఁ దీసివేయలేక, క్రమక్రమంబునఁ దక్కినసోదరు లందఱు రణమునఁ దెగువఱకు జనకుని సమీపమున నుండెను. రణమునకుఁ బోవుటకుఁ గుమారునివంతు వచ్చినదని తెలిసికొని రాణా మంత్రుల సామంతుల సేనాధిపతుల రాజబంధువులఁ బిలిపించీ కొలువుఁ దీర్చి "శూరులార! హత శేషుఁడై ననాప్రియనందనుఁ డజేయసింగు పోవలసిన కాలము వచ్చినది. ఈ నగరరక్షణమునకయి యీ బాలునిబదులు పెద్దవాఁడను నేనే ప్రాణము లర్పించెదను. దైవాను గ్రహ మున్న యెడల మనమిప్పుడు చేయఁజాలని యీవీరకర్మ మీ బాలుఁడు చేయఁగూడదా ',, అని సభ్యుల మనస్సులు నీ రగునట్లు జాలిగదురఁ బలికెను. ఆపలుకులు విని సభాసదు లందఱు నైకకంఠ్యముగ "వలదువలదు. మీరొక్కరు పోవలదు మనమందఱముఁ గలసియే పోవుదము. ఇప్పుడే యుద్ధ సన్నద్ధులమై వీర కంకణములఁ గట్టుకొని పసపు బట్టలు ధరించి ఖడ్గపాణులమై మీ వెంటవచ్చి చిత్తూరుపుర రక్షణము నకు మాయసువుల విడిచెద" మని శౌర్య ముట్టిపడ నుత్సాహవచనములఁ బలికిరి.

అంతట రాణా వారితో నిట్లనియె. సరే! మీరట్లే చేయ వచ్చునుగాని మనయంతఃపుర స్త్రీలు పాపమునకు వెనుదీయని పచ్చి తురకలపాలుగా కుండునట్టి యేర్పాటులు మనము సేయవలయును. పిమ్మట మనము నిశ్చలమనస్కులమై పగతుర దాఁక వచ్చును., అనుటయు నందఱు నది యవశ్యకర్తవ్యమని తత్ప్రయత్నములఁ జేయఁదొడఁ గిరి. ఆకోటలో నాపత్కాలమున దాఁగొనుటకు నిడివియు సన్నదనమును గల నేలగదులు సొరంగములు గుహలు గొన్ని కలవు. సేవకు లాస్థలములలో కట్టెలతో చితులం బేర్చి చమురుబిందెల నచట సిద్ధ పఱిచిరి. అంతయు నాయత్త మగుటయు నంతఃపుర కాంతాజనంబులు రాణి