పుట:Raajasthaana-Kathaavali.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని.

21


మొదలు దాసివఱ కందఱుఁ బసపుబట్టలు గట్టి సమస్త భూషణములు ధరించి 'పెండ్లికిఁ బోవు తేఱంగున సంతోషముతో నొక యుత్సవము జరిగినట్లు గుహలలోనికిం బోయి మల్లెపూబాన్పుల నెక్కినట్లు చితుల పై దుమికి శరీరము అగ్ని హోత్రున 'కాహుతులు చేసిరి. తన కారణమున మీవారు రాజ్యమున, కంత దురవస్థ సంభవిం చెనుగదా యనిచింతిలుచుఁ బద్మినీ దేవియుఁ దక్కిన కాంతలతోడ నిప్పుల గుండమువద్దకుఁ బోయి సాటి లేని తనచక్కనిమే నగ్నిహోత్రున 'కాహుతిఁ జేసెను. పిమ్మట మగవాండ్ర వంతు వచ్చినందున వారందఱు పసపుబట్టలను గట్టుకొని మృత్యుకన్యను వరించు పెండ్లి కుమారులు వలె సమరరంగము నకుఁ బయన మైరి. ఆజోదులను 'మొనగాఁ డై నడపింప నజేయసింగు సిద్ధ మయ్యె. కాని రాణా వాని నట్టి ప్రయత్నమునుండి మరల్చి “నాతండ్రీ ! నాకంఠమునఁ బ్రాణము లుండ నావంశ మంతమయ్యే ననుమాట నా చెవిని బడనీయక నీ వెందైనం జని నీప్రాణములం దక్కించుకోమ్మని శూరులగు రాజపుత్రులఁ గొందఱ సాయ మిచ్చి కొడుకు నావలకుం బంపెను. అజేయసింగు జనకుని యదృష్టవశము ననో రాజకుమారుల నందఱఁ దనపొట్టం బెట్టుకొన్న పుర దేవతాప్రసాదంబుననో శత్రువులకంట బడకుండ నవ్వలకుం బోయి సురక్షిత మగుప్రదేశమును జేరెను.కొందఱు నిరపాయముగ దాఁటె నను మాట వినిన తోడనే రాణా కోటతలుపులం దీయించి సైన్యంబును బగతుర పైఁ బురికొల్పుటయు నా సేన దిగబారు 'సెలయేటి చందంబున వడివడి వచ్చి మ్లేచ్ఛసైన్యంబు దాఁ కె. రాజపుత్ర యోధులు నెత్తురులు ద్రావ వచ్చు బెబ్బులట్లు కదనరంగముఁ బ్రవేశించి వీరావేశముచే నొడ లెఱుంగక నడచినచో టెల్ల పీనుఁగ పెంటలు గావించుచు 'వేటాఱుతునియలుగఁ దురకల నఱకుచు వీరవిహారంబు సల్పిరి.రస పుతులకు శౌర్య మెంత యున్నను వారిసంఖ్య యనధిక మగుట చేతను శౌర్యహీనులగుతురకలసంఖ్య మితిమీరి యుండుట చేతను