పుట:Raajasthaana-Kathaavali.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని.

19


రాత్రి నామందిరమునకు వచ్చి యేమిజరుగునో చూడుఁడు. ఆదేవత మరల రావచ్చు నని నేఁ దలంచెద.'నని రాణా పలుకుటయు రాజ బంధువు లారాత్రి వాని మందిరమున కరిగి కనుమూయక చూచుచుండ నడిరేయి వెనుకటియట్లు భూతము కనంబడలేదుగాని వినువారి గుండెలు జల్లు మనునట్టు లీక్రిందపలుకులు వినఁబడెను. "నా కాకలి యగు చున్నది. నా కాఁకలి యగు చున్నది. దురాత్ములగు మ్లేచ్చుల నెత్తు 'రెంత త్రావినను నాకుఁ దృప్తి లేదు. నాకు రాజులరక్తము గుటగుట ద్రాగవలేనని యున్నది. రాణాకుటుంబమునుండి పండ్రెండుగురు రాజకుమారులు 'నేరి యందొక్కొక్కనికి బట్టాభిషేకముఁ జేసి ఛత్ర చామరాది రాజచిహ్నములిచ్చు మూఁడు దినములు మీవారు ‘రాజ్యము వాని చేత నేలించి నాలుగవదినమున మ్లేచ్చుల మీఁదికి యుద్దమునకుఁ బంపుఁడు. ఒక నితరువాత నోకని నీవిధముగ బలి యిచ్చిన నేను జిత్తూరునగరమునుండి దేశమున కొక భంగము రాకుండఁ గాపాడెదను. "

పుర దేవత పలికిన యాదారుణవచనములకు నాఁ డచ్చటఁ జేరిన రాజపుత్రులలో శంకించిన వాఁడు వెఱచినవాఁడు నొకఁడయినను లేఁడయ్యె. రాణాకోడుకులు పండ్రెండుగురు 'దేశ క్షేమకర మగునీపని కిం దమప్రాణముల నిచ్చెద మని నిర్భయముగఁ జెప్పి 'నేను ముందు బోవుదు నేను ముందు బోవుదు నని తమలోఁ దారు వంతులు వేసఁ జొచ్చిరి. తుట్టతుదకు జ్యేష్ఠకుమారుఁడు తండ్రిక డుపునఁ దాను దొలు దొల్త నుదయించుటచే ముందుగఁ బోవుటకుఁ దనకు స్వాతంత్ర్యాము గలదని వాదింప వాని యనుజు లందఱు నందుకు సమ్మతించిరి. గ్రామదేవత చెప్పినట్లతఁ డభిషిక్తుడయి మూడు ప్రొద్దులు రాజ్యమేలి నాలవనాఁడు పగతుర దాఁకి వీర స్వర్గము నొందెను.అనంతరము రెండవ కుమారుఁ డగున జేయసింగువకు వంతు వచ్చె. ఇతఁడు తండ్రికి దక్కినకొడుకులకన్న నధిక ప్రియుఁ డగుటచేఁ దండ్రి 'నాయనా