పుట:Raajasthaana-Kathaavali.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రాజస్థానకథావళి,


వర్తి యది కనిపెట్టి యాచో టెత్తు చేయింపఁ దలంచి తట్ట కొకడబ్బు చొప్పున నిచ్చిద నని చెప్పి సైనికుల చేత మట్టి మోయించి కోట యెత్తున నొక దిబ్బ గావించి దానిమీద గోడలను బగులగొట్టుటకు, కోట సంరక్షించువారిఁ జంపుటకు లోపలి వారిఁ గడ తేర్చుటకుఁ దగిన యుద్ధ సాధనములును యంత సాధనములును బెట్టించి పని జేయించెను. కోటలోపల నున్న రాజపుత్రులకు లోక సామాన్య మగుప్రతాపపౌరు షములు కలవుగాని మహమ్మదీయుల వద్ద నుండుయంత్ర సాధనాదులు లేకపోవుటచేఁ గోట నిలుచుటయుఁ దమప్రాణములు దక్కుటయు నసాధ్యమని తలంచిరి. అంతలో వర్ష కాలము ప్రారంభమై రాజపుత్రుల బాధలనధికము చేసెను. రాణా యగులక్ష్మణసిం గొకనాఁడు రాత్రి మేల్కని యొకచోట నొక్కఁడు గూర్చుండి మీవారు రాజ్యమునకు రాఁదలంచిన మహోపద్రవమును గూర్చి యోచించుచుండఁగ నొకమూలనుండి "నా కాకలి యగుచున్నదీ నా కాఁకలి యగుచున్న ”దని యొక ధ్వని వినఁబడెను. ఆశబ్దము విని యతఁ డదరిపడి దిగ్గున లేచి నలు కెలంకులఁ జూచునప్పటికి వాని యెదుట దీపము వెలుఁగున భయంకరాకారము కల యొక పెనుభూతము గనఁబడెను. లక్ష్మణసింగు దానిం గని యామె చిత్తూరునగరమును గాపాడు పుర దేవత యని నిశ్చయించి దానితో "రాజపుత్రుల నెత్తురు కావలసినంత ద్రావితివి గదా నీకిం కేమి కావలయ" నని భయభక్తులతో నడిగెను. అప్పు డాపాడుదయ్యము వానితో "నాకు రాజుల నెత్తురు ద్రావినంగాని తనివి సనదు. ఈ నగరమునకు నాసహాయము గావలయునేని మూర్థాభిషిక్తు లగురాజులు పండెండుగురు నాకు బలి కావలయు" నని యుత్తర మిచ్చి యంతర్ధాన మయ్యెను. రాణాయు మిగిలిన రాత్రి యంతయు నిశ్శబ్దముగాఁ గడపి ప్రాతఃకాలమున సేనాధిపతులను బంధువులను రావించి కొలువుదీర్చి రేయి జరిగిన చిత్ర కథ 'వారి కెఱింగించెను. కానీ వారెవ్వ రాకథ నమ్మరైరి. 'నామాటలు నమ్మరేని మీరీ