పుట:Raajasthaana-Kathaavali.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిలీ, మీవారునకును సంధి.

195


రాణా మనోహరమగు మందిరము నొక దానిని కట్టించి మహమ్మదీయులకు రాజపుతులకు సంబధ మేమియు లేకుండునట్లు షాజహానుని వాని సేనాపతి నందు విడియించెను. కరుణుఁ డామందిరమున షాజహానున కేసౌఖ్యమునకు వెలితి లేకుండున ట్లేర్పాటులు చేసెను. అతని టెక్కెము మేడపయి నాటించెను. లోపల స్ఫటిక శిలతోఁ జక్రవతి౯ పుత్రున కొక సింహాసనము జెక్కించెను. వేయేల? ఆ హజారమున కెదుట నమాజు సేయుటకు మసీదుగూడ కట్టించెను.

ప్రాణమిత్రుఁడగు భీమరాజు నేలఁగూలుటయు వాని చెలికాఁడగు మానసింగు మిత్రవియోగము చేత జీవితాశ విడిచెనని వినుటయు షాజహాను మనోహర మందిరంబునుండి సుఖ మనుభవించుచున్నను వాని మనస్సు మాత్రము స్థిమితము గలిగియుండదయ్యే. మానసింగున కు భీమునకుఁగల స్నేహము లోకాతీతమయనది. భీముఁడు మృతినొందినచో మానసింగు బ్రతుక నని ప్రతినపట్టెను. అందుచేత మానసింగు సేవకులు భీముఁడు మృతినొందిన వాత౯ వానితోఁ జెప్పక దాఁచిప్రతిదినము పళ్ళెములతో ననేకభక్ష్యములు తెచ్చి యవి భీముండే పంపి నాఁడని తెలియఁ జేయుచు గొంత కాలము గడిపిరి. దురదృష్టవశమున నెట్లో భీముని మరణవాత౯ యొకనాఁడు మానసింగుని చెవులం బడియె. పడుటయు మానసింగు దుస్సహమగు మిత్రవియోగమునకుఁ దాళఁ జాలక దేహమాపాదమస్తకము నిండి యున్న యెనుబదిగాయ ములమీద పట్టీల, నూడఁబెఱికి తాను చావకమాన నని నేలంబండు కొని ప్రాణముల విడిచెను.

అనంతరము షాజహాను తన కుదయపురమే నెలవుగాఁ జేసికొని దేశద్రిమ్మరియై కొంత కాల మిందు కొంత కాల మందు తిరుగుచువచ్చెను. ఎంతతిరిగినను లాభము లేమిచే షాజహాను స్వలాభముఁ జూచుకొని తండ్రితో సంధి చేసికొనుటయే యుత్తమమని యెంచి తాను లోఁబడితినని రాయబార మంపి విశేషించి తండ్రికిఁ జాలనమ్మిన పులు