పుట:Raajasthaana-Kathaavali.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

రాజస్థానకథావళి,


సన్నద్ధులయి గలసిరి. ఉభయ సైన్యము లొండొరులఁ దాకుటకె సిద్ధమయినపుడు చక్రవతి౯ యెవరి దురాలోచనమో విని మహావీరుఁడు నుత్తమకులస్థుఁడు నగుతనమామగారికి సైన్యాధిపత్య మీయక యంబర దేశపురాజు గజసింగునకంటే తక్కువవాఁడు నగు జయసింగున కిచ్చెను, అభిమానధనులగు రహతూరువంశస్థులు తమ రాజునకు సైన్యాధిపత్యము లేనిచో గత్తియే ముట్టమనిరి. గజసింగును నిర్భయముగ దనవారియభిప్రాయముఁ జక్రవతి౯తోఁ జెప్పి తన సేనం దీసికొని దూరముగఁ బోయెను. అట్టిసమయమున భీముఁడు గజసింగు తనతోఁ గలి యునేమో యని యాస పడి వానికిఁ బౌరుషముగలుగున ట్లీవిధముగ వర్తమానమంపెను. "రహతూరువంశస్థు లూరకున్నా రేమి? కలసిన మాతోఁగలియుండు లేనిచోఁ గత్తిదూసి యుద్ధము సేయుఁడు." సందేశమున కనుగొనినట్లే ప్రత్యుత్తరము వచ్చెను. సంధిగ్ధ మనస్కుఁడగు నాముసలిరాజు భీమునిపలుకులకు రోసముంజెంది చక్రవతి౯ పక్షముఁ జేరి రహతూరులం బురికొల్ప వారు విజృంభించి యుద్ధభూమిఁ బీనుఁగు పెంటలు జేసి యాదినమున షాజహాను నోడించిరి. భీముఁడు రణరంగమునఁబడి చచ్చెను. మానసింగు గాయపడుటచే రహతూరులు వాని నెక్కడికో 'మోసికొనిపోయిరి. మహబత్ఖానుఁడు షాజహాను ప్రాణభీతిచే రణరంగము విడిచి యుదయపురమునకుఁ బారిపోయిరి.

రాణా కరుణుఁడు తమ్ముఁడగు భీమునిచేత సమర సంబంధము మానిపింప లేక పోయినను సహజముగఁ జాల బుద్ధిశాలి యగుటచే మొదటి నుండియుఁ దానమాత్ర మీకలహమున జోక్యముఁ గలుగఁ జేసి కొనఁడయ్యె. అతనిసంకల్పము చక్రవతి౯కిఁ గృతజ్ఞుఁడై యుండుటయే. అట్లు కృతనిశ్చయుఁ డయినను జక్ర వతి౯ కొడుకంతటివాఁడు దీనుండయి తన దేశమునఁ దల దాఁచుకొనవచ్చినప్పుడు వేరుభంగి నుపేక్షిం చుట పాడిగాదని కరుణుండు వానినిఁ గరుణించి సగౌరవముగ నాదరించెను. ఉదయపుర సమీపమున నున్న సరస్సులో నొకలంక మీఁద